immunity food: రోగ నిరోధక శక్తి పెరగాలా? రోజూ ఈ సాంప్రదాయక చిట్కాలు పాటించండి – easy diet tips to boost your immunity


రోగ నిరోధక శక్తి అనేది అప్పటికప్పుడు పొందేది కాదు. మీరు రోజూ తీసుకునే ఆహారంపైనే అది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. మీరు నిత్యం జంక్ ఫుడ్ తింటూ.. అకస్మా్త్తుగా రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తినడం వల్ల వెంటనే ఫలితం కనిపించదు. ఆ ఆహారాన్ని ఒక అలవాటుగా తీసుకొంటేనే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతుంది. అయితే, దీని గురించి పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. ఇప్పటికైనా మీరు మీ ఆహార అలవాట్లను మార్చుకుని.. రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టి పెట్టవచ్చు.

కరోనా వైరస్ వృద్ధులపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని భావించారు. కానీ, అది అన్ని వయస్సుల వారినీ బలీ తీసుకుంటోంది. అయితే, ఇక బతకరేమో అనుకున్న వృద్ధులు మళ్లీ ఆరోగ్యంతో కోలుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సాంప్రదాయ ఆహారాన్ని తిసుకున్నవాళ్లే. జంక్ ఫుడ్ అందుబాటులోకి రాకముందు మన పూర్వికులు క్రమ పద్ధతిలో ఆహారాన్ని తీసుకొనేవారు. వాటిలో తప్పకుండా పోషకాలు, శరీరానికి మేలు చేసే పదార్థాలు ఉండేలా జాగ్రత్తపడ్డేవారు. ముఖ్యం అల్లం, పసుపు, నిమ్మ, ఉసిరి వంటివి ఎక్కువగా తినేవారు. మీరు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. తప్పకుండా వీటిని తీసుకోండి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూడండి.

ఉసిరి కాయ: కోవిడ్-19కు వ్యాక్సిన్ కనుగోవడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో వైద్యులు ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచే మార్గాలను అన్వేషిస్తున్నారు. చాలామంది వైద్యులు ‘విటమిన్-సి’ తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన రక్షణ కల్పించవచ్చని భావిస్తున్నారు. ఉసిరిలో యాంటీ బాక్టీరియల్, రక్తస్రావ నివారిణి లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే గొప్ప ఔషదం. అయితే, ఉసిరి కాయలు సులుభంగా లభించడం లేదు. దుకాణాల్లో పొడి రూపంలో దొరుకుతున్నాయి. ఉదయం వేళల్లో ఒక స్పూన్ ఉసిరి పొడిన మజ్జిగలో వేసుకుని కలుపుకుని తాగండి. అలాగే, ఉసిరి-కొబ్బరితో తయారు చేసిన చట్నీలను టిఫిన్లలో కలుపుకుని తినడం ద్వారా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. మీకు ఉసిరి కాయలు అందుబాటులో ఉంటే.. వాటిని పసుపు, ఉప్పు కలిపిన ద్రావణంలో మగ్గపెట్టి తింటే మరింత ఆరోగ్యం.

పసుపు: ఇందులోని సుగుణాల గురించి భారతీయులకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. పసుపు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ లక్షణాలు ఇందులో మెండుగా ఉంటాయి. పసుపు యాంటీ సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. అందుకే, గాయాలైతే పసుపును అద్దుతారు. ఉదయాన్నే గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో తగినంత పసుపు, నిమ్మ, అల్లం, కొద్దిగా తేనె కలుపుకుని తాగినట్లయితే ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. పసుపు-పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక కూరలు ఇతరాత్ర వంటకాల్లో కూడా నిత్యం పసుపును వాడటం ద్వారా శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

Also Read: మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు!

అల్లం: శరీరానికి మేలు చేయడంలో దీని తర్వాతే ఏదైనా. మీకు చాయ్ తాగే అలవాటు ఉన్నట్లయితే తప్పకుండా అల్లం వేసుకుని తాగండి. ఇదీ మీ గొంతు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. జలుపు, జ్వరాలను దూరంగా ఉంచేందుకు అల్లం సూపర్‌గా పనిచేస్తుంది. కొన్ని సాంప్రదాయ మందుల దుకాణాల్లో ఎండబెట్టిన అల్లాన్ని ఔషదంగా ఇస్తుంటారు. తమిళనాడులో వీటిని సుక్కు అని పిలుస్తారు. మిరియాలు, జీలకర్ర, దనియాల పొడితో అల్లాన్ని తినడం మంచిది.

Also Read: తాటి ముంజులతో ఆరోగ్యం మస్త్.. రోగాలన్నీ మటాష్!

నిమ్మకాయ: విటమిన్-సి పుష్కలంగా ఉండే నిమ్మకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలను సన్నని ముక్కలు చేసుకుని నీటి జగ్గు లేదా వాటర్ బాటిళ్లల్లో వేసుకోవాలి. అయితే, ఒక రోజు మించి ఎక్కువ రోజులు వాటిని ఉపయోగించకూడదు. ఏ రోజుకారోజు వాటిని మారుస్తుండాలి. ఎప్పటికప్పుడు తాజా నిమ్మ చెక్కలను వేసుకోవాలి. కొంతమంది నిమ్మతో చారు కూడా తయారు చేస్తారు. చింతపండుకు బదులుగా నిమ్మ రసాన్ని వేసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. చూశారుగా.. నిత్యం ఇవి తీసుకోవడం ద్వారా మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *