importance of surya namaskar: సూర్య నమస్కారాలు చేస్తే బరువు తగ్గుతారా.. కరీనా కపూర్ ఏం చెబుతుందంటే.. – kareen kapoor khan’s workout routine know here diet also


బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో కరీనా ఒకరు.. ఈమె గత కొన్నిరోజులుగా అక్కడ హవా కొనసాగిస్తుంది. తన బ్యూటీ అండ్ పెర్ఫామెన్స్‌తో ఎంతోమందికి ఫేవరేట్‌ గా మారింది. ఈ నేపథ్యంలోనే తను తన ఫిగర్‌ని కాపాడుకునేందుకు వర్కౌట్స్ చేస్తుంటుంది. ఆ వర్కౌట్ సీక్రెట్స్ తెలిసిపోయాయి. ఆమె డైట్, వర్కౌట్స్ గురించిన డిస్కషన్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

​ఫిట్‌గా ఉండేందుకు..

samayam telugu

కరీనా కపూర్ తీసుకునే ఫుడ్ సూపర్ హెల్దీ గా ఉంటుందని మనందరికీ తెలుసు. ఆమె వర్కౌట్ స్టైల్ కూడా అంతే హెల్దీగా ఉంటుంది. ఆమె ఫేవరేట్ యోగా. ఆమె యోగా ని గత పదేళ్ళనించీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మిగిలిన ఎక్సర్సైజెస్ చేసే ముందు కరీనా చేస్తున్న సూర్యనమస్కారాల ఫోటోని ఆమె పర్సనల్ యోగా ట్రైనర్ రూపల్ సిధ్పురా రీసెంట్ గా షేర్ చేశారు.

​సూర్యనమస్కారాలు

samayam telugu

హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ కి వెళ్ళే ముందు కరీనా తో డజన్ల కొద్దీ సూర్యనమస్కారాలు చేయించిన రోజులు గుర్తొస్తున్నాయని ఆ పోస్ట్ లో ఉంది. కరీనా తన వర్కౌట్స్ ని అంకితభావంతో చేస్తుందని కూడా ఆమె ట్రైనర్ మెచ్చుకున్నారు. ఇక్కడ చూసినట్టు కరీనా చాలా ప్రొఫెషనల్ గా సూర్యనమస్కారాలు చేయడంలో వింత ఏం లేదు. ఎందుకంటే, ఆమె చాలా మంది సెలిబ్రిటీస్ లా చాలా కాలం నుంచి యోగా చేస్తున్నారు.

Also Read : గుండె సమస్యలు, టెన్షన్స్ దూరం కావాలా.. ఇలా చేసి చూడండి..

ఎందుకు సూర్యనమస్కారాలంటే ఇష్టం?

samayam telugu

ఇన్వర్షన్ ఎక్సర్సైజెస్, ఏరియల్ యోగా తో పాటూ ఆమె ఎన్నో యోగాసనాలు ట్రై చేసినా సూర్యనమస్కారాలు మాత్రం ఆమె ఫేవరేట్. ఆమె అంటారు. “నేను అష్టాంగ చేస్తాను. కానీ, మామూలు సూర్యనమస్కారాలు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి”. యోగా వల్ల ఎంతో మేలు జరిగినా, రెగ్యులర్ గా సూర్యనమస్కారాలు చేయడం మాత్రం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యనమస్కరాల వల్ల లాభాల్లో ఒకటి బరువు తగ్గడం..ప్రతిరోజూ సూర్యనమస్కారాలని కనీసం పది సార్లు చేస్తే ఆ ఇంటెన్సిటీకి అధికంగా ఉన్న బరువు కరిగిపోతుంది. తరవాత కూడా బరువుని అదుపులో ఉంచుకోడానికి ఇది చక్కని మార్గం.

Also Read : ఎముకల నొప్పి, నీరసం కాన్సర్ లక్షణాలా.. బోన్‌మారో ట్రీట్‌మెంట్ గురించి తెలుసుకోండి..

​పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి..

samayam telugu

రోజూ సూర్యనమస్కారాలు చెయ్యడం వల్ల రిప్రొడక్టివ్ సిస్టం కి ఎంతో మేలు చేకూరుతుంది. హార్మోన్లు సమతూకంలో ఉండడమే కాక, పీసీఓయెస్, పీసీఓడీ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దీంతో పాట ఇమ్యూనిటీని పెంచుతుంది. మీ శరీరపు పనితీరుని మెరుగుపరుచుకోడానికీ మీరు సింపుల్ గా ఎఫెక్టివ్ గా ఉండే పద్ధతి కోసం వెతుకుతుంటే రోజూ సూర్యనమస్కారాలు చెయ్యడం స్టార్ట్ చెయ్యండి. అవి శరీరంలోని టాక్సిన్స్ ని బైటికి పంపేసి, రక్తప్రసరణకు తోడ్పడి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Also Read : పెళ్లి అయిన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇవే జరుగుతాయి..

​కరీనా సీక్రెట్స్

samayam telugu

యోగాతో పాటూ కరీనా కార్డియో, ఇంకా పైలేట్స్ కూడా రెగ్యులర్ గా చేస్తారు. డెలివరీ తరవాత ఆమె ఇంకొన్ని ఫిట్నెస్ రెజీంస్ తో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆమె ఎయిరోబిక్స్, హెచ్ ఐ ఐ టీ, పైలేట్స్, కిక్ బాక్సింగ్ మార్చి మార్చి చేసినా యోగాని మాత్రం రెగ్యులర్ గా చేస్తారు. ఆమె ఒకసారి చెప్పినట్టు యోగా ఆమె లో ఒక భాగం. కరీనా ఎప్పుడూ వర్కౌట్స్ మిస్ చెయ్యరు. ఈ స్టైల్ దివా తన యోగా సెషన్ ని ఎప్పుడూ మిస్ చెయ్యరు. తన బేబీ బాయ్ తైమూర్ తో కలిసి ఆమె హోం జిమ్‌కి వెళ్తుంది..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *