India China border: భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ మంత్రి సంచనల వ్యాఖ్యలు – chinese forces moved up to north of india along lac, says us state secretary mike pompeo


భారత్‌తో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని తరలిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత పాలనలో ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఆరోపించారు. ఎల్ఏసీ వద్ద లడఖ్, ఉత్తర సిక్కిమ్ ప్రాంతంలోని పలుచోట్ల భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రికత్తలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ‘భారత్‌కు ఉత్తరాన సరిహద్దుల్లో ఎల్ఏసీ వద్ద తన సైన్యాలను చైనా ప్రస్తుతం మోహరించిందని, అసలు అక్కడ ఏం జరుగుతోంది’అని మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. అంతేకాదు, కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరును ఆయన మరోసారి ఎండగట్టారు.

వుహాన్‌లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించిన తొలి నాళ్లలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జాప్యం చేసిందని దుయ్యబట్టారు. అలాగే, హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను హరించడానికి ఇప్పుడు కంకణం కట్టుకుందని విమర్శించారు. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఆరాటం.. మేధో సంపత్తిని తస్కరించడానికి నిరంతర ప్రయత్నాలు ఇవి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలనలోని రెండు పార్శ్యాలని ఆరోపించారు.

చైనా పాలకులు తీసుకునే చర్యలు అక్కడ ప్రజలు, హాంకాంగ్‌ వాసులపై మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై కూడా పెను ప్రభావాన్ని చూపుతాయని పాంపియో అన్నారు. ‘చైనా విధానాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే బాధ్యత, సామర్థ్యం అమెరికాకు ఉంది.. చైనా నుంచి వస్తున్న బెదిరింపులను గుర్తించి విదేశాంగ విధానం ద్వారా అమెరికా ప్రజలకు సహకారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

భారత్ సరిహద్దులు, హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు పాంపియో సమాధానం ఇస్తూ… గత ఆరు నెలల్లో మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా చైనా సైనిక బలప్రదర్శన, ఆపై నిరంతరం దూకుడు చర్యలను కొనసాగించడాన్ని చూస్తున్నాం. నేను భారత్ గురించి ప్రస్తావించాను. మీరు దక్షిణ చైనా సముద్రం గురించి లేవనెత్తారు’ అని వ్యాఖ్యానించారు.

‘ఒన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఓడరేవులను నిర్మించటానికి ప్రయత్నిస్తోందని, సైనికపరంగా విస్తరించడానికి వారి నిరంతర ప్రయత్నాలను గమనిస్తున్నామని ఆయన అన్నారు. గత 20 ఏళ్లుగా అమెరికా ఈ విషయాలపై సరైన రీతిలో స్పందించలేదని అన్నారు. ‘మేము చైనా మార్కెట్‌లో ఉన్న 1.5 బిలియన్ల ప్రజలను అమెరికా ఆర్ధికవ్యవస్థకు చాలా ముఖ్యమైనదిగా భావించాం.. ఇతర దేశాలకు అనుకూలంగా ఉన్న మమ్మల్ని చైనీయులు అడ్డుకునే ప్రమాదం ఉంది.. ప్రజలు ఇప్పుడే చాలా ఆందోళన చెందుతున్నారని తాను భావిస్తున్నాను’ పాంపియో చెప్పారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *