India China border: సరిహద్దుల్లో వివాదంపై చైనా కీలక వ్యాఖ్యలు.. ట్రంప్ ప్రకటనతో డ్రాాగన్ మేల్కొందా! – india and china pose no threat to each other at border says chinese envoy


భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. డ్రాగన్ మీడియా సైతం దుందుడుకు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో చైనా రాయబారి బుధవారం కీల వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలు సంయమనం పాటిస్తున్నాయని, వివాదాన్ని పరిష్కరించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, తమ మధ్య విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, ద్వైపాక్షిక సహకారానికి ఎప్పుడూ అనుమతించబోమని అన్నారు.

సన్ వీడాంగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే చైనా రాజీకి వస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, భారత్, చైనా మధ్య సరిహద్దుల వివాదం పరిష్కారానికి అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చైనా మేల్కొన్నట్టు తెలుస్తోంది.

పొరుగువారిని ఒకరికొకరు అవకాశాలుగా అభివర్ణించిన వీడాంగ్.. దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని పెంచడానికి అభివృద్ధిని సరైన మార్గంలో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితి మొత్తం స్థిరంగా, అదుపులోనే ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించిన రోజే సన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల, సంప్రదింపుల ద్వారా భారత్, చైనాలు సమస్యను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు.

తూర్పు లడఖ్‌లో ఘర్షణ జరిగిన ప్రదేశాలలో ప్రతిష్టంభన కొనసాగుతున్నా.. చైనా దళాలు భారత ప్రాంతాలలోకి చొరబడినా, రెండు వైపులా కమాండర్లు సన్నిహితంగా ఉన్నారు. ఎల్ఏసీ వెంట సాధారణ పెట్రోలింగ్‌ను ఉపసంహరించుకునే వరకు చైనా దళాలు ఎదుర్కొంటున్న ఫార్వర్డ్ పొజిషన్ల నుంచి వెనక్కి తగ్గబోమని రెండు రోజుల కిందట భారత్ స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.

‘మన విభేదాలను మనం సరిగ్గా చూడాలి.. ద్వైపాక్షిక సహకారం ఎప్పటికీ అనుమతించవద్దు. అదే సమయంలో, పరస్పర చర్చల ద్వారా అవగాహనకు వచ్చి సమస్యలను నిరంతరం పరిష్కరించుకోవాలి’అని చైనా రాయబారి అన్నారు. చైనా, భారత్‌లు ‘సామరస్యపూర్వక సహజీవనం’సాగిస్తూ కలిసి ముందుకు సాగాలని అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినవేళ మరింత తీవ్రతకు దారితీయకుండా చూసే ప్రయత్నాలను చైనా ప్రారంభించిందనడానికి ఇది సంకేతం.

ఇరుదేశాలు ఒకరికొకరు అవకాశాలు అనే ‘ప్రాథమిక సూత్రానికి కట్టుబడి ఉండాలని సన్ అన్నారు. ఒకరి నుంచి ఒకరికి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. డ్రాగన్, ఏనుగు నృత్యం సాక్షాత్కారం.. చైనా, భారత్‌ల సరైన ఎంపిక, ఇది మన రెండు దేశాల, ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా రెండూ ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేయాలి … సాధారణ ప్రయోజనాలను విస్తరించాలి’ యువజన ప్రతినిధి బృందం, కొద్దిమంది జర్నలిస్టులతో జరిగిన ఓ వెబ్‌నార్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *