India in G7: జీ7 దేశాల కూటమిలోకి భారత్.. డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు! – us president donald trump wants to expand g7 to g 10/11 to include india


జూన్‌లో నిర్వహించాల్సిన జీ-7 దేశాల సదస్సును అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్టెంబరులో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కూటమిలో కొత్తగా సభ్య దేశాలను చేర్చుకుంటాని సంకేతాలు ఇచ్చారు. జీ-7ను 10 లేదా 11కు చేరనుంది. ఈ జాబితాలో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా భారత్‌ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఉన్న సభ్యదేశాల కూర్పు ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహించేలా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ తాజా ప్రతిపాదన.. అంతర్జాతీయంగా భారత్‌ పరపతి పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమే జీ-7. దీనిలో ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, అమెరికా, బ్రిటన్‌, కెనడాలు ఉన్నాయి. ఈ ఏడాది జీ-7 కూటమికి అమెరికా అధ్యక్షత వహిస్తోంది. ఏటా నిర్వహించే వార్షిక సదస్సుకు ఒకటి లేదా రెండు ఇతర దేశాధినేతలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది అధ్యక్షత వహించిన ఫ్రాన్స్‌.. ప్రధాని మోదీని ఆహ్వానించింది. మరోసారి ఈ సదస్సుకు మోదీని ఆహ్వానించాలని అమెరికా భావిస్తున్నట్టు సమాచారం.

అయితే, అమెరికాలో జరగబోయే జీ-7 దేశాల సదస్సుకు తాను హాజరుకాబోనని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించింది. ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడితే ఈ నిర్ణయంపై పునరాలోచిస్తామని తెలిపింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆమె హాజరయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఈ సదస్సు జూన్‌ 10-12 మధ్య జరగాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ప్రస్తుతం జీ-7 కూటమి తొలుత 1973లో జీ -6గా ప్రారంభమయ్యింది. తర్వాత ఈ కూటమిలో కెనడా చేరడంతో జీ-7గా మారింది. ఆరు దేశాలతో ఆవిర్భించిన ఈ కూటమి తొలి సదస్సు 1975లో ఫ్రాన్స్‌లో జరిగింది. తొలుత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్‌లతో ఏర్పడగా తర్వాత కెనడా చేరింది.ఈ గ్రూపులో 1998లో రష్యా ఎనిమిదో సభ్య దేశంగా చేరింది. క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో 2014లో రష్యాను కూటమి నుంచి సస్పెండ్ చేశారు. అందువల్ల ప్రస్తుతానికి ఇది జీ7 కూటమిగా ఉంది.

తాజాగా, దీని పునఃనిర్మాణానికి అవకాశం రావడంతో ట్రంప్ దీనిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. సెప్టెంబరుకు ప్రస్తుతం వార్షిక సమావేశం వాయిదా వేయగా.. బహుశా ఇదే సమయంలో యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం కూడా ఉంటుదంది. ‘షెడ్యూల్ చేసిన జీ7 సమావేశంవాయిదా వేస్తున్నాను ఎందుకంటే G7గా ఇది ప్రపంచంలో ఏమి జరుగుతుందో సరిగ్గా సూచిస్తుందని నాకు అనిపించదు. ఇది కాలం చెల్లిన దేశాల సమూహం’అని ఫ్లోరిడా నుంచి తిరిగి వస్తూ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *