International Tea Day: గుండె సమస్యలు ఉన్నవారు టీ తాగొచ్చా.. – here are the top 10 health benefits of tea


వేసవికాలం, చలికాలం, వర్షాకాలం – ఏ కాలమైనా టీ కాలమే. వేసవికాలమైతే ఐస్డ్ టీ తాగుతామంతే. టీ కేవలం ఓ రిఫ్రెష్‌మెంట్ మాత్రమే కాదు. అది హెల్త్ కి కూడా ఎంతో మంచిది. టీతో కలిగే మరిన్ని లాభాలేంటంటే..

1. యవ్వనంగా ఉంచుతాయి..

యాంటీ-ఆక్సిడెంత్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మనని యంగ్ గా ఉంచుతాయి. పొల్యూషన్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడతాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ కంటే కూడా వైట్ టీ చాలా తక్కువ ప్రాసెస్ అవుతుంది. అందుకనే అందులో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్‌గా తాగండి..

2. ఒత్తిడి తగ్గుతుంది…

కాఫీ కంటే టీ లో యాభై శాతం తక్కువ కెఫీన్ ఉంటుంది. ఇక హెర్బల్ టీ ల లో అసలు కెఫీనే ఉండదు. అంటే నెర్వస్ సిస్టం కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా టీ తాగచ్చన్న మాట. కాఫీ తగ్గించి టీ తాగుదామనుకునే వారు చికొరీ రూట్ టీ ట్రై చెయ్యచ్చు. దాని రుచీ, సువాసనా కాఫీ కి దగ్గరగా ఉంటాయి. చికొరీ రూట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తి కూడా మంచిది.

Also Read : సమ్మర్‌లో బార్లీ నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..

3. గుండె సమస్యలు దూరం..

టీ కీ, గుండె ఆరోగ్యానికీ ఉన్న సంబంధం గురించి చాలా స్టడీస్ ఉన్నాయి. రోజూ ఒకటి నించి మూడు కప్పుల టీ తాగే వాళ్ళలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఇరవై శాతం, స్ట్రోక్ వచ్చే అవకాశం ముప్ఫై ఐదు శాతం తగ్గిందట. ఇక నాలుగు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగేవాళ్ళలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ముప్ఫై రెండు శాతం తగ్గిందట. నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగితే బాత్‌రూమ్‌కికి పరిగెడుతూ ఉండాలి, కానీ ఒక కప్పు మాచా టీ తో అవే బెనిఫిట్స్ పొందవచ్చు. పొడి చేసిన గ్రీన్ టీ ఆకులతో చేసే మాచా టీ ఒక కప్పు మామూలు గ్రీన్ టీ పది కప్పులకి సమానం.

4. బరువు తగ్గేందుకు..

చాలా ఎక్కువ టీ తాగేవాళ్ళలో బరువు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. బ్లాక్ టీ కంటే గ్రీన్ టీ ఇంకా మంచిది. గ్రీన్ టీ లో ఉన్న పాలీఫినాల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక టీ తాగినా దానిలో అద్భుత గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

5. ఎముకలని బలోపేతం చేస్తుంది

జంతువుల మీద చేసిన పరిశోధనల్లో టీ వల్ల ఎముకలు బలోపేతమౌతాయని తెలుస్తోంది. పాలలో కంటే ఎక్కువ కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, కే, ఉన్న మొరింగా టీ బలమైన ఎముకలు కావాలనుకునేవాళ్ళకి మంచి ఆప్షన్. ఈ మొరింగా టీ ని సూపర్ ఫుడ్ అని కూడా అంటున్నారు.

Also Read : అశ్వగంధ తింటే కరోనా రాదా.. దీని వల్ల ప్రయోజనాలు ఏంటి..

6. అందమైన నవ్వుకోసం..

టీ తాగడం వల్ల పళ్ళ మీద ఎనామిల్ పోకుండా ఉంటుంది. కేవిటీస్ ఏర్పడవు. అందువల్ల టీ రెగ్యులర్ గా తాగే వాళ్ళు చక్కగా నవ్వగలుగుతారు.

7. ఇమ్యూనిటీ ని పెంచుతుంది

టీ ఇమ్యూన్ సెల్స్ ని ప్రేరేపిస్తుంది. అందువల్ల అవి వాటి లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటాయి. టీ లో ఉండే యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాల వల్ల దెబ్బలు తగిలినప్పుడు గానీ, జబ్బు చేసినప్పుడు గానీ ఇమ్యూనిటీ పెరుగుతుంది.

8. కాన్సర్ తో పోరాడుతుంది

కుటుంబం లో ఎవరికైనా కాన్సర్ ఉంటే, అది రాకుండా ఏమైనా సరే చేద్దామనుకునే వాళ్ళు టీ ఎక్కువ తాగడం వల్ల ఉపయోగముండచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు.

Also Read : కేవలం రోజ్ వాటర్‌తోనే మీ స్కిన్, కళ్ళని మెరిపించొచ్చు ఇలా..

9. జీర్ణ సమస్యలు దూరం..

చామోమిల్ టీ లాంటి హెర్బల్ టీ లు ఇరిటబుల్ బవెల్ సిండ్రోం ఉన్న వారికి బాగా హెల్ప్ చేస్తాయి. అల్లం టీ వల్ల వికారం తగ్గుతుంది. జింజర్ చామోమిల్ టీ తాగితే రెండు ప్రాబ్లంస్ సాల్వ్ అవుతాయి.

10. కేలోరీలు కూడా ఉండవు..

నీళ్ళ బదులు తాగడానికి మంచి ప్రత్యామ్న్యాయం. పైగా రకరకాలు రుచుల్లో తాగచ్చు. చల్లగా, లేదా వేడి గా తాగచ్చు. అందులో ఇంకేమీ కలపక్కర్లేదు కూడా.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *