Intinti Gruhalakshmi Serial: ‘ఇంటింటి గృహలక్ష్మి’ అక్టోబర్ 26 ఎపిసోడ్! ఉత్కంఠగా మారిన కథ! జడ్జ్ ముందు తులసి, నందు.. – intinti gruhalakshmi telugu serial written updates 26 october 2020; tulasi is heartbroken


బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ 146 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 147 ఎపిసోడ్‌కి నేడు(అక్టోబర్ 26)న ఎంటర్ అయ్యింది.

147 ఎపిసోడ్‌ హైలైట్స్..
విడాకుల కోసం తులసి కోర్టుకు వచ్చి నందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొడుకుతో తులసి బాధగా.. ‘నచ్చిందే చెయ్యాలనుకున్నాను.. నచ్చిన వాళ్లతోనే ఉందామనుకున్నాను.. కానీ కాలానికి తలవంచుతున్నాను.. కాలం చూపిస్తున్న దారిలోనే వెళ్తున్నాను’ అంటుంది. ఇంతలో లాయర్ వచ్చి.. ‘అమ్మా.. వాళ్లు కూడా వచ్చేస్తే త్వరగా తేలిపోతుంది విషయం.. కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి’ అంటాడు, అయితే తులసి.. ‘మీరే కాల్ చేసి తెలుసుకోండి’ అనడంతో ఆ లాయర్ నందుకి కాల్ చేస్తాడు.

‘సార్ మీరు ఇంకా రాలేదేంటి? మేడమ్(తులసి) వాళ్లు వచ్చేశారు మీకోసం వెయిటింగ్’ అనడంతో ‘వస్తున్నాం దగ్గర్లో ఉన్నాం..’ అని ఫోన్ పెట్టేస్తాడు నందు. లాయర్ మాటలు విన్న లాస్య నందుతో.. ‘చూశావా నందు. తులసికి చాలా హ్యాపీగా ఉన్నట్లుంది.. ఇప్పటికైనా తెలిసిందా..? నువ్వేమో తను పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావ్.. కానీ తను విడాకులు ఎప్పుడు ఇస్తావా అని ఆలోచిస్తోంది’ అంటూ ఎక్కిస్తుంది. తులసి అన్నయ్య ‘అమ్మా తులసి నేను బావగారితో మాట్లాడనా?’ అని అడగడంతో.. ‘వద్దు అన్నయ్యా మాట్లాడితే సద్దుమనిగే విషయం కాదు ఇది.. గుమ్మం దాటేప్పుడే గుండె రాయి చేసుకుని వచ్చాను..’ అంటుండగానే నందు వాళ్లు కోర్టుకి వస్తారు. లాస్య నందుని చేయి పట్టుకుని రావడం చూసిన తులసి బాధగా మౌనంగా ఉండిపోతుంది.

తర్వాత లాయర్ వచ్చి.. ఇద్దరి చేత సంతకాలు పెట్టించుకుని జడ్జ్ ముందు కూర్చోడెట్టడంతో సీన్ మరింత ఎమోషనల్‌గా మారింది. జడ్జ్ ఇద్దరితో.. ‘25 సంవత్సరాలు కలిసి ఉన్నారంటే.. మాటలు కాదు.. తొందరి పడి నిర్ణయం తీసుకుంటున్నారని నేను అనలేను.. సరైన నిర్ణయం తీసుకుని తెలివి మీ ఇద్దరికీ ఉందనే నేను నమ్ముతున్నాను.. అలా అని ఇది సరైన నిర్ణయం అని నేను అనుకోను.. సంతోషాన్ని దుఖాన్ని పంచుకుంటూ ఇన్నేళ్లు ప్రయాణం చేశారు. మళ్లీ ఒకసారి మీ నిర్ణయం చెప్పండి..’ అనడంతో… ‘ఇంకా ఆలోచించేవాళ్లమైతే ఇక్కడి వరకూ వచ్చేవాళ్లమే కాదు.. విడిపోదామని ఆలోచన కలిగాక కలిసి ఉండటంలో అర్థం లేదు.. మా ఆలోచనల్లో మార్పు లేదు..’ అంటుంది తులసి బాధగా.

‘మిస్టర్ నందగోపాల్ మీ మాటేంటీ?’ అంటాడు జడ్జ్. ‘నా మూలంగా టెన్షన్ పడి గుండె పోటి తెచ్చుకున్నారు.. నా మూలంగానే ప్రమాదంలో పడ్డారు ఈ ఒక్క కారణం చాలు ఆయనకు నా నుంచి విడిపోవడానికి’ అని మళ్లీ తులసే మాట్లాడటంతో నందు కూడా బాధగా తులసి వైపు చూస్తాడు. ‘చట్టరిత్యా భరణం కోరుకుంటున్నారా? ఇన్నాళ్లు మీరు మీ భర్త మీద ఆధారపడి బతికారు కదా.. ఆ ఆధారం మీకు ఉండేలా కొంత మొత్తం మీకు ఇచ్చేలా చేస్తాం..’ అని జడ్జ్ అనడంతో.. ‘కలిసున్నప్పుడే కావాలని అనుకోలేదు.. విడిపోయాక ఆయన ఆధాయం నాకెందుకు అక్కర్లేదు. పెళ్లి అయిన నాటి నుంచి నా ప్రేమ అభిమానం నేను పంచాను.. వాటికి ప్రతిఫలం నేను ఎప్పుడూ ఆశించను…’ అంటుంది తులసి.

‘విడాకులు మంజూరు కావడానికి సమయం పడుతుంది. ఈలోపు కలవాలని మీరు అనుకున్నా మాకు తెలియజెయ్యొచ్చు.’ అంటూ జడ్జ్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తులసి, నందు ఒకేసారి లేచిన సమయంలో తులసి వెనక్కి తూలబోతుంటే నందు పట్టుకుంటాడు. ఆ సీన్‌లో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటుంటే.. ఆ సీన్ మరింత ఎమోషనల్‌గా ఉంది. మొత్తానికి తులసి నందు చేతుల నుంచి విడిపించుకుని.. మౌనంగా వెళ్లిపోవడంతో నందుకి కూడా కాస్త బాధగా, భారంగా అనిపిస్తుంది. అయితే అంతా వెళ్లగానే లాస్య అతడి దగ్గరకు చేరుకుని.. అతడి మనసు కలుషితం చెయ్యడానికి సిద్ధంగా ఉండటంతో.. కథ ఏ మలుపు తిరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘ఇంటింటి గృహలక్ష్మి’ కొనసాగుతోంది.
Read also: ‘కార్తీకదీపం’ అక్టోబర్ 26 ఎపిసోడ్! ఫ్లోలో కార్తీక్ ముందు నిజం వాగిన మౌనిత!‘పిల్లలు పుట్టరని..’Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *