IPL: చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 మ్యాజిక్ మూమెంట్స్‌చెన్నై సూప‌ర్ కింగ్స్.. ఐపీఎల్ టోర్నీ చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా విజ‌య‌వంత‌మైన జ‌ట్టు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 12 ఏళ్ల లీగ్ చ‌రిత్ర‌లో ప‌ది సార్లు బ‌రిలోకి దిగింది. మ‌ధ్య‌లో రెండుసార్లు నిషేధం కార‌ణంగా 2016,17ల‌లో ఆడ‌లేదు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ సార‌థ్యంలో జట్టు అద్భుతాలు సృష్టించింది. అయితే ఆడిన ప‌దిసార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుని చ‌రిత్ర సృష్టించింది. ఇక ఐపీఎల్‌లో ఎనిమిదిసార్లు ఫైన‌ల్‌కు చేరుకుని స‌త్తా చాటింది. ఇందులో మూడుసార్లు విజేత‌గా నిలిచింది. అలాగే మ‌రో ఐదుసార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. సీఎస్కే ఆడిన ప‌ది ఏళ్ల‌లో అనేక అద్భుత పోరాటాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక జ‌ట్టు చ‌రిత్ర‌ను ప‌రిశీలించి న‌ట్ల‌యితే ఎన్నో మైలురాళ్లు క‌నిపిస్తాయి. అయితే అందులో కొన్నింటిని ఎంచాలంటే చాలా క‌ష్ట‌మైన ప‌నే. అయితే ఈ ఐదు సంద‌ర్భాలు మాత్రం లీగ్‌లో జ‌ట్టు స్థాయిని తెలుపుతాయి. ఇవి సీఎస్కే అభిమానులకు చాల స్పెషల్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వాటి వివరాల గురించి తెలుసుకుందాం.

2010లో సెమీస్ చేర‌డానికి చెన్నై సూప‌ర్ కింగ్స్ పోరాడుతోంది. లీగ్ ద‌శ‌లో అంతంత‌మాత్రం ఆట‌తీరునే క‌ర‌బ‌ర్చింది. ఈ ద‌శ‌లో సెమీస్ చేరాలంటే కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌తో జరిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవ‌ర్లో విజ‌యానికి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. క్రీజులో ఉన్న ధోనీ.. అల‌వోక‌గా ప‌రుగులు సాధించాడు. కేవ‌లం నాలుగు బంతుల్లోనే 16 ప‌రుగులు సాధించ‌డంతో జ‌ట్టు విజ‌యతీరాల‌కు చేరింది. ఇక సెమీస్‌లో డెక్క‌న్‌చార్జర్స్‌నుచిత్తు చేసిన చెన్నై.. ఫైన‌ల్లో ముంబై ఇండియ‌న్స్‌ను ఓడించి తొలిసారి ఐపీఎల్ చాంపియ‌న్‌గా నిలిచింది.

2010 ఐపీఎల్ ఫైన‌ల్లో ధోనీ స‌మ‌య‌స్ఫూర్తితో చెన్నై సూప‌ర్ కింగ్స్ గెలిచింది. ముఖ్యంగా చేధ‌న‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట్స్‌మ‌న్ కీర‌న్ పొలార్డ్ చెల‌రేగిపోతున్నాడు. ఓ ద‌శ‌లో త‌మ ప్రధాన పేస‌ర్ డ‌గ్ బొలింజ‌ర్ బౌలింగ్‌లో 22 ప‌రుగులు బాది ఉన్నాడు. ఈ ద‌శ‌లో ఆ ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి ఫీల్డ‌ర్ ప్లేస్‌మెంట్ మార్చిన ధోనీ స‌త్ఫ‌లితాన్ని పొందాడు. ఫీల్డ‌ర్‌ను మిడాఫ్ వ‌ద్ద ఉంచి ఆఖ‌రి బంతిని బొలింజ‌ర్ చేత వేయించాడు. ఆ బంతిని మిస్ హిట్ చేసిన పొలార్డ్‌.. మిడాఫ్‌లో ఫీల్డ‌ర్ చేతికి చిక్కాడు. దీంతో పొలార్డ్ పెవిలియ‌న్‌కు చేర‌డంతో చెన్నై క‌థ సుఖాంత‌మైంది. ఈ క్ర‌మంలో 22 ప‌రుగుల‌తో చెన్నై విజ‌యం సాధించింది. తొలిసారి టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

నిషేధం నుంచి తిరిగొచ్చాక చెన్నై సూప‌ర్ కింగ్స్ విచిత్ర‌మైన ప‌రిస్థితిలో నిలిచింది. ముఖ్యంగా వ‌య‌సు మ‌ళ్లిన ఆట‌గాళ్లను ఎక్కువ‌గా కొనుగోలు చేసిన చెన్నైని డాడ్స్ ఆర్మీ అంటూ విమ‌ర్శ‌కులు తెగ వెక్కిరించారు. అయినా న‌వ్వినా నాప‌చేనే పండుతుంద‌నే నానుడి మాదిరిగా ఆ సీజ‌న్లో చెన్నై విజేత‌గా నిలిచింది. ముఖ్యంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆస్ట్రేలియా వెట‌ర‌న్ ప్లేయ‌ర్ షేన్ వాట్స‌న్ (57 బంతుల్లో 117) సెంచ‌రీతో జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. దీంతో మూడుసార్లు టైటిల్ సాధించిన ముంబై స‌ర‌స‌న చెన్నై నిలిచింది.

ముందే చెప్పుకున్న‌ట్లు 2016, 17ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిషేధం బారిన ప‌డింది. అయితే 2018లో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన చెన్నై.. తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియ‌న్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో 166 ప‌రుగుల చేధ‌న‌లో ఓ ద‌శ‌లో 75/5తతో నిలిచింది. ఈ క్ర‌మంలో డ్వేన్ బ్రావో (30 బంతుల్లో 68) సూప‌ర్ షోతో మ్యాచ్‌ను తిర‌గ‌రాశాడు. ముంబై బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడిన బ్రావో జ‌ట్టును విజ‌యం అంచున నిలిపాడు. అయితే 19వ ఓవ‌ర్ చివ‌రిబంతికి ఔట‌య్యాడు. ఈ ద‌శలో రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగిన కేదార్ జాద‌వ్ మ‌ళ్లీ బ్యాటింగ్‌కు దిగి జ‌ట్టును గెలిపించాడు. దీంతో ఐపీఎల్లోకి చెన్నై రీఎంట్రీ ఇచ్చింది. ఇదే జోరులో మూడోసారి చాంపియ‌న్‌గా నిలిచింది.

2012లో సీఎస్కే కీల‌క‌మైన సంద‌ర్భంలో జూలు విదిల్చిన సంఘ‌ట‌న ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. ముఖ్యంగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 206 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించింది. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 43 ప‌రుగులు కావ‌ల్సి ఉండ‌గా.. సీఎస్కే అద్బుత‌మే చేసింది. ముఖ్యంగా 19వ ఓవ‌ర్ వేసిన విరాట్ కోహ్లీ బౌలింగ్‌లో చెన్నై బ్యాట్స్‌మ‌న్ అల్బీ మోర్కెల్ 28 ప‌రుగులు పిండుకున్నారు. దీంతో చివ‌రి ఓవ‌ర్‌కు స‌మీక‌ర‌ణం 15 ప‌రుగులుగా మారింది. లాస్ట్ ఓవ‌ర్ వేసిన విన‌య్ కుమార్ బౌలింగ్‌లో 17 ప‌రుగులు చేసిన డ్వేన్ బ్రావో జ‌ట్టుక ఘ‌న‌విజ‌యాన్ని అందించాడు. అత్యంత కీల‌క‌స‌మ‌యంలో చెన్నై సాధించిన విజ‌యం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. దీంతో ఆ టీమ్ బెంగ‌ళూరును దాటి ప్లే ఆఫ్స్‌కు చేరింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *