is nonveg safe: నాన్ వెజ్ కొంటున్నారా.. ఇక్కడే తీసుకోండి.. – expert health tips suggested by doctors for your family’s health amid coronavirus scare


ఏం తినాలి, ఎలా తినాలి అన్న దాని గురించి చాలా మంది సలహాలు ఇస్తుంటారు. ఏది ఫాలో అవ్వాలో మనకి అర్ధం కాదు. చిన్నప్పుడే హాయి, ఏది రెడీ గా ఉంటే అది తినటమే. ఇప్పుడు తినొచ్చు అనే సెక్షన్ లో ఉన్న ఫుడ్స్ కంటే తినకూడదు అనే సెక్షన్‌లో ఉన్న ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఇలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకోండి..

​ఆలివ్ ఆయిల్‌తో వంట..

samayam telugu

తాజా కూరగాయలు ఎక్కువగా తింటే ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే. వాటినే కొంచెం ఆలివ్ ఆయిల్‌లో వేసి ఫ్రై చేయండి, హార్ట్ ప్రాబ్లంస్ మీ దరి చేరవు. ఇలా తినడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. అదే విధంగా.. పాకేజ్డ్ ఫుడ్స్ ఏవి కొన్నా లేబుల్ చూసి కొనండి. ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ పెద్దదవుతున్న కొద్దీ ప్రాసెసింగ్ ఎక్కువ జరిగినట్టు లెక్క. పైగా పైకి హెల్దీ గా కనిపించే ఫుడ్ ఐటెమ్స్‌లో అక్కర్లేని ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. ఉదాహరణకి బ్రెడ్ లో షుగర్.

నాన్ వెజ్ ఇక్కడే కొనండి..

samayam telugu

ప్రాసెస్ చేయని మీట్ తినండి. ప్రాసెస్డ్ మీట్ లో ప్రిజర్వేటివ్స్, సోడియం చాలా ఎక్కువ ఉంటాయి. కుదిరినంతవరకూ డైరెక్ట్ గా మీరే షాపుకి వెళ్లి మీట్ తెచ్చుకోండి. ఇంట్లోనే వండుకోండి. అప్పుడే బావుంటుంది. ఎందుకంటే బయట చాలా చోట్ల వండిన నూనెతోనే మళ్లీ మళ్లీ వంటలు చేస్తున్నారు. ఈ టైమ్‌లో అలాంటి ఫుడ్ తినడం మంచిది కాదు.

Also Read : జొన్న రొట్టె తింటే షుగర్ వ్యాధి కంట్రోల్‌ అవుతుందా..

​ఈ ఫుడ్ అవసరం..

samayam telugu

తయారు చేసే ఫుడ్స్ లో ఫైబర్ అస్సలు ఉండదు. యాంటీ-ఆక్సిడెంట్స్ ఉండవు. ఎక్స్ట్రా ఉప్పూ, పంచదార ఉంటాయి. వీటిని ఎప్పుడైనా తినచ్చు కానీ, అందుకే చిప్స్, కేక్స్ వంటి జంక్ ఫుడ్‌కి ఇప్పుడు తీసుకోకపోవడమే మంచిది. వీటితో పాటు.. నమిలి తినే ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. అంటే యాపిల్స్, కారెట్స్, నట్స్ వంటి వాటి వల్ల నెమ్మదిగా తింటాం, కడుపు నిండా తింటాం.

​నీరు ఎక్కువగా తీసుకోండి..

samayam telugu

నెమ్మదిగా తినండి. స్లో గా తింటున్నప్పుడు ఏం తింటున్నాం, అది ఎంత రుచిగా ఉంది, ఎంత తింటున్నాం – ఇవన్నీ మైండ్ లో రిజిస్టర్ అవుతాయి. అదే గబగబ తినేస్తే మాత్రం ఇవేవీ మనసుకి పట్టవు. అందుకే, ఎంజాయ్ చేస్తూ తినండి. ఎక్కువ నీళ్ళు తాగండి. ఇందు వల్ల అతి దాహం లేకుండా ఉంటుంది. అతిగా తినకుండా ఉంటాం.

Also Read : కాఫీ పౌడర్‌తో ఇలా చేస్తే మీ ముఖం మెరవడం ఖాయం..

​టైమ్‌కి ఫుడ్..

samayam telugu

టైం కి తినెయ్యండి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ – ఇవన్నీ వేటి టైం కి అవి పొట్టలోకి వెళ్ళిపోవాలి. హడావిడిలో తినడం మర్చిపోయారనుకోండి. మెటబాలిజం దెబ్బతినడమే కాదు, తరవాత తినే ఫుడ్ చాలా ఎక్కువగా తింటాం. ఈలోపు నీరసంగా అనిపిస్తుంది. హెల్దీ స్నాక్స్ రడీ గా ఉంచుకోండి. పొద్దున్న పదకొండింటికి ఆల్మోస్ట్ అందరికీ ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఫ్రూట్స్, నట్స్ లాంటివి ఎదురుగా పెట్టుకుంటే జంక్ ఫుడ్ వేపు మనసు లాగదు.

Also Read : చెమటకాయలని తగ్గించే ఇంటి చిట్కాలు..

కూల్ డ్రింక్స్ బదులు..

samayam telugu

మీకు బాగా ఇష్టమైన వాటిల్లో లో-ఫాట్ వెర్షన్స్ జోలికి వెళ్లొద్దు. తినేటప్పుడు హాయిగా తినండి. ఒకే చోట కూర్చుని తినండి. టీవీ చూస్తూ, కంప్యూటర్ లో వర్క్ చేస్తూ, ఫోన్ లో చాట్ చెయ్యకుండా తినటం అలవాటు చేసుకుంటే ఎంత అవసరమో అంతే తింటాం. రకరకాల హెల్త్ డ్రింక్స్ లో ఉండే షుగర్ శాతాన్ని గమనించండి. మంచినీరు, టీ, కాఫీ కాని వాటన్నింట్లోనూ షుగర్ ఎక్కువగా ఉంటుంది. వాటి బదులు ఐస్డ్ టీ లాంటి హెల్దీ ఆప్షన్స్ ట్రై చెయ్యచ్చు.స్మూతీలు ఇంట్లోనే చేసుకోండి. బయట దొరికే స్మూతీల్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *