jaipur couple murder: ఒకే గోత్రమని చంపేశారు.. ప్రేమజంట దారుణ హత్య – love couple brutally murdered in rajasthan


రాజస్థాన్‌లో పరువు హత్యల పరంపర కొనసాగుతోంది. ప్రియుడితో కూతురు పారిపోయిందన్న కోపంతో ఇద్దరినీ దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంట్లో ఉన్న ఇద్దరినీ బయటికి లాక్కొచ్చి మారణాయుధాలతో కిరాతకంగా నరికి చంపేశారు. ధోల్‌పూర్ జిల్లా రాజ్‌ఖెరా పరిధిలోని థార్ గ్రామానికి చెందిన బంటు సింగ్(21), అనిత సింగ్(20) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఇంటి నుంచి పారిపోయారు.

ప్రియుడితో పారిపోయి తమ పరువు తీసిందని అనిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. పారిపోయిన ప్రేమ జంట ఊరికి తిరిగొచ్చిందని తెలియడంతో మూకుమ్మడిగా ప్రియుడి ఇంటిపై దాడి చేశారు. యువతి బాబాయిలు, సోదరులు మారణాయుధాలతో దాడి చేసి ప్రేమజంటని దారుణంగా హతమార్చారు. ఇంట్లో ఉన్న ప్రేమజంటను బయటికి లాక్కొచ్చి అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు.

Also Read: బెడ్రూమ్‌లో ఏకాంతంగా భార్యాభర్తలు.. రంధ్రంలో నుంచి చూస్తూ పక్కింటి వ్యక్తి..

యువకుడు అక్కడికక్కడే మరణించగా.. యువతిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచింది. అయితే యువతి, యువకులిద్దరిదీ ఒకే గోత్రమని.. ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకోకూడదని చెబుతున్నారు. అయితే అవి ముమ్మాటికీ పరువు హత్యలేనని ప్రియుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమించుకుని పారిపోయారన్న కోపంతోనే జంటని నరికి చంపేశారని ఆరోపణలు చేశారు.

Read Also: ‘నా ఒంటిపై బట్టల్లేవ్.. సిగరెట్లతో కాల్చారు..’ భార్య గ్యాంగ్ రేప్ కేసులో దారుణాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *