jharkhand doctor harassed: కోవిడ్ ఆస్పత్రిలో కామపిశాచి.. లేడీ డాక్టర్ నోరుమూసి.. దారుణం – senior doctor tried to rape his junior in jharkhand


కామంతో కళ్లుమూసుకుపోయి జూనియర్ లేడీ డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. సీనియర్‌ డాక్టర్‌గా వైద్య సేవలందించడంలో సూచనలు చేయాల్సిందిపోయి కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఒప్పుకోకపోవడంతో రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. అది కూడా కోవిడ్ ఆస్పత్రిలో కావడం గమనార్హం. కరోనా మహమ్మారితో ముందుండి పోరాడుతున్న వైద్యులను దేవుళ్లుగా కొలుస్తున్న ఇలాంటి విపత్కర సమయంలో కామంతో రెచ్చిపోయి వైద్యవృత్తికే కళంకం తెచ్చాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది.

జూనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న మహిళా వైద్యురాలిపై సీనియర్ డాక్టర్ అత్యాచారానికి యత్నించిన దారుణ ఘటన రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో జరిగింది. పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని రిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ అయిన డాక్టర్ ఆమెపై కన్నేశాడు. తరచూ వేధింపులకు గురిచేసేవాడు.

Also Read: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకి దొరికిపోవడంతో..

ఆమె నైట్ డ్యూటీకి రావడంతో కీచక డాక్టర్ కామంతో రెచ్చిపోయాడు. ఆమెను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై పడి పశువాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ఆమె కేకలు పెట్టడంతో నోరుమూసి అత్యాచారం చేసేందుకు విఫల యత్నం చేశాడు. ఎలాగో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను రేప్ చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also: కొత్త కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయం చూసి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *