kadapa kids corona names : కడప: కరోనా కుమారి, కరోనా కుమార్.. పిల్లలకు వెరైటీ పేర్లు – new born babies named as corona kumari and corona kumar in kadapa district


కరోనా పేరు చెబితే ప్రపంచం మొత్తం వణికిస్తోంది. ఆ పేరు తలచుకోవాలంటే భయం.. కానీ వెరైటీగా కరోనా సమయంలో పుట్టిన పిల్లలకు వినూత్నమైన పేర్లతో నామకరణం చేస్తున్నారు. ఈ వైరస్ సమయంలో పిల్లలు జన్మించడంతో గుర్తుగా వారికి పేర్లు మార్చి పెడుతున్నారు. తాజాగా కడప జిల్లాలో అదే జరిగింది.. అప్పుడే పుట్టిన ఇద్దరు పిల్లలకు కరోనా కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు.


కడప జిల్లా వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసవం కోసం వేంపల్లెలోని గండిరోడ్డులో ఉన్న బాషా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి నిర్వాహకుడు ఎస్‌.ఎఫ్‌ బాషా సదరు మహిళలకు సర్జరీ చేసి పురుడుపోశారు. కరోనా సమయంలో పిల్లలు జన్మించడంతో పాపకు కరోనా కుమారి, బాబుకు కరోనా కుమార్‌ అనే పేర్లు పెట్టారు. డాక్టర్లు ఇలా పేర్లు పెట్టాలని ప్రతిపాదించగా.. బిడ్డల తల్లిదండ్రులు కూడా అంగీకరించారు.

కడప మాత్రమే కాదు.. చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో జన్మించిన కవలలకు కూడా ఈ పేర్లే పెట్టారు. ఒకరికి కరోనా అని, మరొకరికి కోవిడ్ అని నామకరణం చేశారు. ఒకరికి ఆడ బిడ్డకు కరోనా.. మగ బిడ్డకు కోవిడ్ అని పేర్లు పెట్టారు. మొత్తానికి కరోనా ప్రభావంతో కొంతమంది పిల్లల పేర్లు కూడా మారిపోతున్నాయి. గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్‌లు వచ్చిన సమయంలో కూడా ఇలాగే వెరైటీ పేర్లను పెట్టేవారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *