kadapa steel plant: కడప స్టీల్ ప్లాంట్‌పై ముందడుగు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు – cm jagan review meeting on kadapa steel plant


కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో సెయిల్‌ మాజీ సీఎండీ సీఎస్‌ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముడి ఖనిజం సరఫరా, రవాణా, ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం అంశాలను సీఎం జగన్‌కకు సీఎస్ వర్మ వివరించారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌లో భాగస్వామ్యానికి చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తాయని వర్మ చెప్పారు. అయితే జాయింట్‌ వెంచర్‌ కోసం ప్రయత్నిస్తూనే.. పనులన్నీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ప్లాంట్‌ నిర్మాణానికి స్థలం సిద్ధం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ప్లాంట్‌ కోసం అన్ని రకాల అనుమతులు వెంటనే తెచ్చుకోవాలని సీఎం జగన్ సూచించారు.

కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసి, శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టామని.. మూడేళ్లలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *