kadapa woman murder: పడక సుఖం కోసం పాకులాడిన మహిళ.. చివరికి.. కడప ‘చాందిని’ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు – kadapa police reveals shocking facts in rajampet chandini murder case


బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కుటుంబంలో భర్త అనారోగ్యంతో అక్కడే మరణించాడు. భర్త వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుతో భార్య సొంతజిల్లాకు వచ్చేసి ఒంటరిగా జీవిస్తోంది. అక్కడే ఆమెకు పరిచయమున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కాస్తా సహజీవనానికి దారితీసింది. కొన్నేళ్లు అతనితో కలసి ఉన్న ఆమె మరొకరిపై మనసు పారేసుకుంది. అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. కొత్తప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మేసి డబ్బులు ఇచ్చేసింది. అతను భూములు కొనుక్కుని పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండడంతో పెళ్లి చేసుకోవాలని.. లేకుంటే భూములు తనకి ఇచ్చేయాలంటూ నిలదీసింది. అంతే అప్పటి వరకూ ప్రేమ నటించిన ప్రియుడి నిజస్వరూపం బయటపడింది. ప్రియురాలిని అంతమొందించేందుకు పక్కా ప్లాన్ రూపొందించాడు. బైక్ ఎక్కించుకుని పొలాల్లోకి తీసుకెళ్లి అమానుషంగా చంపేసి ఎంచక్కా అక్కడి నుంచి చెక్కేశాడు. పొలాల్లో మహిళ హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కడప చాందిని మర్డర్ కేసు మిస్టరీని రాజంపేట పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

​భర్త పోయాక ప్రియుడితో సహజీవనం

samayam telugu

నెల్లూరు జిల్లా సాతుపల్లెకి చెందిన బిల్లా సంపూర్ణ అలియాస్ చాందిని(36)కి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లెకు చెందిన లక్ష్మీనరసయ్యతో 18 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కొడుకు. బత్తాయిల వ్యాపారం చేసే లక్ష్మీనరసయ్య కుటుంబంతో సహా చెన్నైకి మకాం మార్చాడు. ఆయన 2009లో అనారోగ్యంతో అక్కడే మరణించాడు. భర్త చనిపోవడంతో సంపూర్ణకి రాజంపేటకి చెందిన హుస్సేన్ బాషాతో సంపూర్ణ వివాహేతర సంబంధం ఏర్పడింది. చెన్నై నుంచి వచ్చేసిన సంపూర్ణ ప్రియుడితో సహజీవనం చేసింది. ప్రియుడు హుసేన్ బాషా ఆమెను పలుచోట్లు ఉంచుతూ ఆ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె పేరును చాందినిగా మార్చినట్లు తెలుస్తోంది.

Also Read: కోవిడ్ ఆస్పత్రిలో కామపిశాచి.. లేడీ డాక్టర్ నోరుమూసి.. దారుణం

​కొత్త ప్రియుడితో ఆ సంబంధం..

samayam telugu

ప్రియుడితో సహజీవనం చేస్తున్న సంపూర్ణ తరచూ ఊరు మారాల్సి వచ్చేది. పులివెందుల, కదిరి, వేంపల్లెలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కదిరి నుంచి కడప జిల్లా వేంపల్లెకు ఇల్లు మారే సమయంలో వేముల మండలం కొత్తపల్లె కు చెందిన సాంబశివతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది శారీరక సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కొద్దికాలం రాసలీలలు సాగించారు. కొత్త ప్రియుడు సాంబశివ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పూర్తిగా నమ్మేసింది. తన వద్ద ఉన్న డబ్బులు సాంబశివకి ఇచ్చేసింది. వాటితో అతను వేంపల్లె పరిధిలోనే ఐదెకరాల భూమి కొనుగోలు చేశాడు.

Read Also: వీఆర్‌ఏ భార్యపై కన్నేసిన వీఆర్వో.. కోరిక తీర్చాలంటూ.. కరీంనగర్‌లో కలకలం

ముఖం చాటేయడంతో అనుమానం..

samayam telugu

అప్పటి వరకూ బాగానే ఉన్నా.. భూములు కొన్న తరువాత నుంచి ప్రియురాలికి ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. మోజు తీరాక ముఖం చాటేస్తున్న ప్రియుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంపూర్ణ తనను పెళ్లి చేసుకోవాలంటూ నిలదీసింది. లేకుంటే తన డబ్బుతో కొన్న ఐదెకరాల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించిన ప్రియుడు సాంబ.. ఆమెను అంతమొందించేందుకు పక్కా ప్లాన్ రచించాడు. డబ్బులు తెచ్చుకుందాం రమ్మంటూ ఆమెను ప్రియుడు బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళి దారుణంగా హత్య చేశాడు.

Also Read: కొత్త కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయం చూసి..

​దారుణంగా చంపి పొదల్లో పడేశాడు..

samayam telugu

రాజంపేటలో జాఫర్ అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుందామని నమ్మించి ఆమెను బైక్‌పై ఎక్కించుకెళ్లిన ప్రియుడు.. పక్కా ప్లాన్ ప్రకారం భోజనం కోసం ఓ చోట ఆగాడు. అక్కడ పార్శిల్ తీసుకుని కలసి భోజనం చేద్దామంటూ చిల్లీస్ డాబా వెనక ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరగడంతో రాయితో తలపై బలంగా కొట్టాడు. దెబ్బ బలంగా తగిలి కిందపడిపోయిన ప్రియురాలిని ఆమె చీరతోనే ఉరివేసి దారుణంగా హత్య చేశాడు. ఊపిరాడకుండా చేసి అమానుషంగా చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని పొలంలోని పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

Read Also: పెళ్లి కాకుండానే గర్భం.. ఆరా తీస్తే దారుణం వెలుగులోకి..

​పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు

samayam telugu

చిల్లీస్ దాబా వెనుక పొదల్లో మహిళ శవం ఉందన్న సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు. ఆమె వెంట తెచ్చుకున్న పర్సు కేసును కీలక మలుపు తిప్పింది. అది బంగారపు షాపు వారు ఇచ్చిన పర్సు కావడంతో ఆమె ఆ షాపు కస్టమర్ అయి ఉంటుందని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అలాగే ఆమె రాజంపేట వచ్చేముందు తన చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె సోదరి ఇచ్చిన సమాచారంతో మృతురాలి ఫోన్ కాల్ వివరాలు సేకరించడంతో అసలు విషయం బయటపడింది. కొత్త ప్రియుడు సాంబ పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసినట్లు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *