kajol : కాజోల్‌కు కరోనా వైరస్… క్లారిటీ ఇచ్చిన అజయ్ దేవగణ్ – “kajol and nysa are absolutely fine”: ajay devgn dismisses rumours


సినీ సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లా కాజోల్ అజయ్ దేవగణ్ ఒకరు. వీరిద్దరూ అన్యూన్యంగా కలిసి మెలిసి ఉంటారు. అంతేకాదు.. అజయ్ దేవగణ్‌కు టాలీవుడ్ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే వీరికి సంబంధించిన ఏ వార్త వచ్చిన అది కాస్త క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే తాజాగా కాజోల్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు కూతురు నైసాకు కూడా వైరస్ సోకిందన్న పుకార్లు వినిపించాయి. దీంతో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ స్పందించాడు. తన భార్య కూతురు క్షేమంగా ఉన్నారని తెలిపాడు. కాజోల్, నైసాకు ఎలాంటి వైరస్ సోకలేదని క్లారిటీ ఇచ్చాడు.


కాజోల్, నైసాలకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ మీడియాలో వార్తలు రావడంతో అజయ్ సోషల్ మీడియా వేదికగానే స్పందించాడు. వారిద్దరి ఆరోగ్యం బాగుందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఇదంతా అసత్యపు ప్రచారమన్నాడు. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు వారిద్దరు క్షేమంగానే ఉన్నారంటూ పోస్టు పెట్టాడు. కాజోల్ 1992లో ‘బేఖుది’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 1993లో షారుఖ్‌తో కలిసి నటించిన ‘బాజీగర్’ సినిమాతో హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖాన్‌తో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’ ‘ కుచ్ కుచ్ హోతా హై’ వంటి బ్లాక్ బస్లర్ హిట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

బాలీవుడ్‌లో వెండితెరపై షారుఖ్ కాజోల్‌ది సూపర్ హిట్ జోడీగా నిలిచింది. అంతేకాదు వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఎక్కడ ఎలాంటి పార్టీల్లో కలుసుకున్నా ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించుకుంటారు. ఇక 1999లో కాజోల్ అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు. అజయ్ కాజోల్ జంటగా దిల్ క్యా కరే, ప్యార్ తో హోనా హీ థా, రాజూ చాచా, గూండారాజ్ తదితర చిత్రాలను చేశారు. తాజాగా చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఇద్దరూ కలిసీ ఇటీవల వచ్చిన ‘తానాజీ’సినిమా ద్వారా వెండిపై మెరిశారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *