karthika deepam serial: కార్తీకదీపం షూటింగ్ లొకేషన్‌లో ఫోటో షేర్ చేసిన సౌర్య! అభిమానుల్లో ఉత్సాహం.. – karthika deepam shourya aka baby krithika shares shooting location pic


నిరీక్షణ ఫలించింది. కార్తీకదీపం అభిమానులకి కనువిందు చేసే వార్తతో… సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది వంటలక్క కూతురు సౌర్య(బేబీ క్రితిక). లాక్ డౌన్‌ కారణంగా ‘ఎక్కడ షూటింగ్స్ అక్కడే బంద్’ అని ప్రభుత్వాలు ఆదేశించడంతో.. మార్చి 27 నుంచి తెలుగు బుల్లితెరకు వినోదాన్ని పంచే సీరియల్స్, ఎంటర్‌టైన్మెంట్ షో అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

దాంతో కార్తీకదీపం అభిమానులు వంటలక్క, డాక్టర్ బాబు, సౌందర్య, సౌర్యలని చాలా మిస్ అయ్యారు. కార్తీకదీపం రీవిజిట్‌తో కాస్త ఉపసమనం కలిగించినప్పటికీ… ‘మిస్యూ వంటలక్కా’, ‘మిస్యూ సౌర్య’ అంటూనే ఉన్నారు. ఈ క్రమంలో లాక్ డౌన్ సడలింపులు,‘స్టార్ మా’ త్వరలోనే సీరియల్స్ అంటూ వదిలిన ప్రోమోలు.. అన్నీ కూడా ‘కార్తీకదీపం మళ్లీ ఎప్పుడు?’ అనేదానిపై ఉత్కంఠ రేపుతూనే ఉన్నాయి.

ఈ లాక్ డౌన్‌లో అటు షూటింగ్స్, ఇటు స్కూల్ లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న కార్తీకదీపం సౌర్య(చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ క్రితిక).. డాన్స్‌లు, డైలాగ్స్‌తో అభిమానుల్ని అలరిస్తూ.. అదరగొట్టిన సంగతి తెలిపిందే. అయితే ఈ రోజు(జూన్ 3) షూటింగ్ లొకేషన్‌లో కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న ఫోటో ఒకటి షేర్ చేసింది మన రౌడీ(బేబీ క్రితిక).

దాంతో అభిమానులు.. ‘వావ్ కార్తీకదీపం షూటింగ్ స్టార్ అయ్యిందా.. సూపర్.. వెయిటింగ్..’ అని కొందరు.. ‘స్టే సేఫ్.. జాగ్రత్త బంగారం’ అని ఇంకొందరు లైక్స్, షేర్లతో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి షూటింగ్ జరుగుతుందంటే అతి కొద్దిరోజుల్లోనే మన అభిమాన సీరియల్‌ని, వంటలక్కని, రౌడీని బుల్లితెర మీద చూడబోతున్నామని మాట.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *