karthika deepam serial: గడ్డుకాలంలోనూ ‘కార్తీకదీపం’దే హవా!! సెకండ్ బ్యాటింగ్‌లోనూ దీపక్క దూకుడు! – new kick to star maa tv with karthika deepam revisit


కార్తీకదీపం బుల్లితెర బాహుబలిగా మారి… సంచనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు వరకూ సీరియల్‌‌లో కొత్త కొత్త ట్విస్ట్‌లతో, భావోద్వేగాలతో ఆసక్తిగా సాగింది. దాంతో మన వంటలక్క వెండితెరకు సైతం గట్టి పోటీనిస్తూ.. రేటింగ్‌లో టాప్ పొజీషన్‌లో కూర్చుంది. కొత్త సినిమా అయినా, స్టార్ హీరోల సినిమా అయినా, బాక్స్ ఆఫీస్ ముందు హిట్ కొట్టిన సినిమా అయినా.. వంటలక్క తర్వాతే అన్నట్టు సాగేది కార్తీకదీపం. అయితే కరోనా బ్రేక్‌తో సీరియల్ షూటింగ్ ఆగిపోయినా.. ప్రేక్షకుల ఆదరణలో కార్తీకదీపం హవా ఏ మాత్రం తగ్గలేదు.
Read also: చిరంజీవి స్టెప్స్‌తో అదరగొట్టిన మన డాక్టర్ బాబు! ప్రాక్టీస్ వీడియో వైరల్..

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌లో.. ‘స్టార్ మా’ని ఓ రేంజ్‌లో నిలబెట్టిన సీరియల్ కార్తీకదీపం. జాతీయ స్థాయిలో టాప్ రేటింగ్ సీరియల్‌గా నిలిచిన కార్తీకదీపం.. లాక్ డౌన్‌‌ లాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఛానల్ రేటింగ్‌ని నిలబెడుతుంది. లాక్ డౌన్‌తో సినిమాలు, సీరియల్స్ అనే తేడా లేకుండా అన్నీ రీవిటిక్స్ ప్లే అవుతున్న తరుణంలో… స్టార్ మా గత వారానికి సంబంధించిన రేటింగ్స్‌లో 6.88 రేటింగ్ సాధించింది కార్తీకదీపం సీరియల్. అయితే ఈ ఛానల్‌లో ప్రసారమైన కార్తికేయ 90 ml చిత్రానికి 11. 12 టాప్ రేటింగ్ రాగా.. వినయవిధేయ రామ చిత్రం 6.35 రేటింగ్‌తో తరువాతి స్థానంలో ఉంది. ఇక మిగతా ఛానల్స్ విషయానికి వస్తే.. ఈటీవీ వార్తలు 11.18 రేటింగ్‌తో టాప్‌లో ఉంది. ఇక జబర్దస్త్ 8.2 రేటింగ్ సాధిస్తుండగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ 4.62 మాత్రమే సాధించగలిగింది.
Read also: హీరోయిన్‌తో బిగ్ బాస్ రవికృష్ణ గొడవ.. ఆ సీరియల్ ఆగిపోవడానికి కారణం ఇదే!

కార్తీకదీపం రీవిజిట్‌తో.. సౌందర్య అసలు క్యారెక్టర్, డాక్టర్ బాబు మంచి మనసు, దీప, కార్తీక్‌ల స్నేహం, వాళ్ల మధ్య సాగే లవ్ సీన్స్, వాళ్లు విడిపోవడానికి అసలు కారణం ఏంటి?, మౌనిత కుట్ర.. ఇలా ఎన్నో విషయాలు ఒకదాని తర్వాత బయటపడుతున్నాయి. దాంతో రీవిజిట్‌ని కూడా క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారు కార్తీకదీపం అభిమానులు.
Read also: అమ్మో ‘మౌనరాగం’ అమ్ములుకి ఎంత కోపం వచ్చింది? ‘ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అంటూ…

ఆల్ రెడీ మొదటి నుంచి సీరియల్ చూస్తున్నవాళ్లు కూడా వంటలక్క కోసం రీవిజిట్ ఫాలో అవుతుంటే.. మొదటి ఎపిసోడ్స్ చూడని వాళ్లు.. సౌందర్య అహం గురించి, డాక్టర్ బాబు మంచితనం గురించి తెలుసుకోవడానికి సీరియల్‌ని ఫాలో అవుతున్నారు. మొన్నటికి మొన్న లైవ్‌లోకి వచ్చిన డాక్టర్ బాబు(నిరుపమ్ పరిటాల) కూడా అదే మాట చెప్పారు. ‘రీవిజిట్‌లో మొదటి ఎపిసోడ్స్ చూస్తున్నవాళ్లంతా ఫర్వాలేదు డాక్టర్ బాబు కూడా మంచివాడే’ అని సర్టిఫికెట్స్ ఇస్తున్నారట. ఆ విషయం చెబుతూ నిరుపమ్ సంబరపడిపోయారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *