karthika deepam serial: Nirupam Paritala: డాక్టర్ బాబుకి బిగ్ బాస్ రవికృష్ణ కాంప్లిమెంట్.. ‘సూపర్ రాజా..’ – here’s how doctor babu aka nirupam paritala looked before becoming an actor


తెలుగు బుల్లితెరకు పరిచయం అవసరం లేని పేరు నిరుపమ్ పరిటాల. బుల్లితెర శోభన బాబుగా గుర్తింపు తెచ్చుకున్న నిరుపమ్.. అందగాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సీరియల్స్‌కి రాక మునుపు సినిమా హీరోగానే ప్రయత్నాలు చేశారు నిరుపమ్. పరిస్థితులు కారణంగా బుల్లితెరకే పరిమితం అయినప్పటికీ.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో ఎగబాకిన సంగతి తెలిసిందే.

బుల్లితెరకు డాక్టర్ బాబుగా బాగా దగ్గరైన నిరుపమ్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ… తన అభిమానుల్ని నిత్యం ఏదోరకంగా అలరించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక టిక్ టాక్ ప్రపంచానికి కూడా అతడి మల్టీటాలెంట్ గురించి బాగానే తెలుసు. గతంలో పాటలు, డైలాగ్స్‌కి లిప్ సింగ్ ఇచ్చి, మూమెంట్ ఇచ్చే డాక్టర్ బాబు.. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి.. తన శ్రీమతి మంజులతో కలిసి ఓన్ వాయిస్‌‌తో ఎన్నో కామెడీ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో వదిలి.. ‘సూపర్ డాక్టర్ బాబు’ అనిపించుకున్నారు.

అయితే ఈసారి అభిమానులతో తన మెమొరీస్‌ని పంచుకున్నారు నిరుపమ్. ‘నేను నటనా రంగంలోని రాకమునుపు.. నేను నా ఫ్రెండ్ ప్రాజెక్ట్‌లో భాగంగా తీసుకున్న‌ ఫోటో ఇది’ అంటూ షేర్ చేసుకున్న డాక్టర్ బాబు.. ఆ ఫోటోలో నూనుగు మీసాలతో సినిమా హీరోలా మెరిసిపోతున్నాడు. అది చూసిన అభినులతో పాటు.. మరో బుల్లితెర సెలబ్రెటీ.. రవికృష్ణ స్పందించడం విశేషం. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో నిరుపమ్ షేర్ చేసిన ఫోటోకి.. రవికృష్ణ(ఆమెకథ హీరో).. ‘సూపర్ రాజా’ అని కామెంట్ పెట్టడంతో.. ఆ కామెంట్‌కి కూడా లైక్స్ వేసుకుంటున్నారు అభిమానులు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *