kcr new scheme: రైతుల కోసం త్వరలో కొత్త పథకం.. దేశమే ఆశ్చర్యపోతుంది: కేసీఆర్ – will announce new scheme for telangana farmers within a week, says cm kcr at kondapochamma sagar


రైతు బంధు, రైతు భీమా పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల కోసం అతి త్వరలో మరో అద్భుత పథకం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆ పథకం ప్రకటనతో దేశమే ఆశ్చర్యపోతుందని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కూక్ మండల కేంద్రంలో శుక్రవారం (మే 29) కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల త్యాగాల గురించి మాట్లాడుతూ.. తాను ప్రకటించబోయే కొత్త పథకం గురించి ప్రస్తావించారు. పథకం అమలుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని.. లెక్కలన్నీ తేలిన వెంటనే ప్రకటిస్తామని తెలిపారు.

వారం రోజుల్లో కొత్త పథకం ప్రకటిస్తామని.. అంతవరకు సస్పెన్స్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నిర్వాసితుల కోసం గజ్వేల్ పట్టణంలో 600 ఎకరాల్లో కొత్త పట్టణం నిర్మితమవుతోందని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూమి కేటాయించిన రైతు కుటుంబాలకు ఇంటికి ఒకరి చొప్పున ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *