kerala elephant death: కేరళ: గర్భిణి ఏనుగు మృతి.. కీలక నిందితుడు అరెస్ట్ – one arrested in connection with pregnant elephant’s death in kerala says minister


కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో గర్భిణి ఏనుగు మృతి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. మూగజీవాల పట్ల అమానుష ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఆ ఏనుగు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. పేలుడుపదార్థాలు కలిగిన పైనాపిల్‌ తినడం వల్లే నోటిలో తీవ్ర గాయాలయ్యాయని తేలింది. ఈ క్రమంలోనే అది నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా ఆకలితో అలమటించిందని నివేదికలో పేర్కొన్నారు. ‘అలా ఒకరోజు మొత్తం నదిలో ఉండి, చివరకు నీరసించి అక్కడే నీటిలో పడి పోయింది. ఊపిరి తిత్తుల వైఫల్యమే ఏనుగు మృతికి కారణం’’ అని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం స్పందించారు. పాలక్కడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటనపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్ని గుర్తించారని, దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. దోషులను అరెస్ట్ చేసిన న్యాయస్థానం ముందు నిలబెట్టి తీరుతామని ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశామని కేరళ అటవీశాఖ మంత్రి రాజు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిగతా దోషుల్ని సైతం త్వరలోనే పట్టుకుంటామని ఆయన ఉద్ఘాటించారు. అత్యంత అమానుషంగా గర్భంతో ఉన్న ఏనుగు మరణానికి కారణమైన మరో వ్యక్తిని పోలీసులు, అటవీ అధికారులు సంయుక్త విచారణలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. పి విల్సన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఇతడు కార్ప్స్ అండ్ స్పైసెస్ ఎస్టేట్‌లో ఉద్యోగం చేస్తున్నాడని అన్నారు. తరుచూ పొలాలు, పంటలను నాశనం చేయడంతో అడవి పందులను భయపెట్టడానికి క్రాకర్లతో నిండిన పండ్ల వలను ఏర్పాటు చేశామని ఇద్దరు వ్యక్తులు విచారణాధికారులకు చెప్పినట్లు సమాచారం.

ఏనుగు మృతికి సంబంధించిన ఫొటోలు ఓ అటవీశాఖ అధికారి తొలుత ఫేస్‌బుక్‌లో పోస్టుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్పందించిన కేరళ వణ్యప్రాణి సంరక్షణ అధికారి సురేంద్ర కుమార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 23న ఆ ఏనుగును స్థానికులు గుర్తించారని, తర్వాత అది అడవిలోకి వెళ్లి.. మళ్లీ 25న తిరిగొచ్చిందని చెప్పారు. అది చనిపోయే ముందు ఒక రోజు మొత్తం వెల్లియార్‌ నదిలోనే ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా పైనాపిల్‌లో పేలుడు పదార్ధాలు పెట్టి ఏనుగుకు తినిపించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. అడవి ఏనుగుల వద్దకు వెళ్లడానికి ఎవరూ సాహసించరని తెలిపారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *