Kerala Elephant Death case: ఏనుగు మృతి కేసులో ముందడుగు.. ముగ్గురు అనుమానితుల గుర్తింపు – kerala elephant death: focus on 3 suspects, probe underway


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ ఏనుగు మృతి కేసులో పురోగతి పడింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ.. బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితులను కేరళ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానితుల్ని విచారిస్తున్నారని, న్యాయం గెలిచి తీరుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్వీట్‌ చేశారు.

పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని సీఎం విజయన్ తెలిపారు. జిల్లా పోలీసు అధికారి, అటవీ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారని వెల్లడించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనల వెనుక ఉన్న కారణాలను కూడా అన్వేషిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొంత మంది ఈ ఘటనను విద్వేషపూరిత ప్రచారానికి వినియోగించుకుంటుడం పట్ల ముఖ్యమంత్రి మండిపడ్డారు.

మరోవైపు.. ఈ ఘటనపై కేరళ చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్ర కుమార్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అది అడవి ఏనుగు అని, ఎవరూ దాని వద్దకు వెళ్లే సాహసం చేయకపోవచ్చని తాను భావిస్తున్నట్లు వివరించారు.

అసలేం జరిగింది?
సైలెంట్ వ్యాలీ సమీపంలో నదీపాయల్లో ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఓ ఆడ ఏనుగుతో కొంత మంది అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఆకలితో ఉన్న ఆ ఏనుగుకు ఓ పైనాపిల్‌‌ను ఆశజూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. ఆ ఏనుగు వారిచ్చిన పండును నోట్లో పెట్టుకోగానే.. ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఏనుగు నోట్లో తీవ్ర గాయమైంది.

నోటి వెంట రక్తం ధారగా కారుతుండగా.. అంత బాధలోనూ ఆ ఏనుగు తనను మోసం చేసిన మనుషులపై దాడి చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. కానీ, ఏనుగు నోట్లో గాయం పుండులా మారింది. ఆ గాయంపై ఈగలు వాలడం మొదలుపెట్టాయి. దీంతో ఆ నొప్పికి విలవిల్లాడుతూ ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి తొండం నీటిలో పెట్టి నిల్చుంది. దీంతో ఏనుగుకు గాయం నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఈగల బాధ తప్పడంతో అక్కడే రోజుల తరబడి అలాగే ఉండిపోయింది. ఓ పక్క ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ. ఆహారం తీసుకోలేని పరిస్థితి. పైగా కడుపులో పెరుగుతున్న బిడ్డ. వెరసి ఆ ఏనుగు చిక్కి శల్యమై ఆ నీటి ప్రవాహంలోనే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *