kerala woman rape: భార్యకి మద్యం తాగించి.. ఫ్రెండ్స్‌తో కలసి భర్త నీచం.. రేప్ చేసి.. – kerala woman gangraped by husband, his friends


కామంతో కళ్లుమూసుకుపోయిన భర్త అత్యంత నీచానికి దిగజారాడు. కట్టుకున్న భార్యని ఫ్రెండ్స్‌ కామకోరికలకు బలి చేశాడు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. నలుగురు స్నేహితులతో కలసి గ్యాంగ్ రేప్ చేశాడు. రాత్రంతా నరకం చూసించి తెల్లవారుజామును రోడ్డుపై పడేశారు. వారి ఐదేళ్ల కొడుకు చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. ఈ అత్యంత అమానుష ఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో చోటుచేసుకుంది.

తిరువనంతపురం శివారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్యాపిల్లలను పుత్తుకురిచ్చి బీచ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ కొద్దిసేపు గడిపిన అనంతరం సమీపంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్దామంటూ భార్యని, పిల్లలను వెంటబెట్టుకెళ్లాడు. అక్కడ భార్యతో బలవంతంగా మద్యం తాగించి దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న భార్యపై తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలసి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

Also Read: తండ్రి పోయిన నెలకే తల్లి రెండో పెళ్లి.. అది నచ్చని కొడుకు..

కామకోరికలతో రగిలిపోతున్న తన స్నేహితులకు అప్పజెప్పి భార్యని బలి చేశాడు. ఐదేళ్ల వయసున్న కన్నకొడుకు ముందే నీచులు తల్లిని అమానుషంగా రేప్ చేశారు. ఒంటిపై సిగరెట్లతో కాల్చుతూ ఆ రాత్రంతా నరకం చూపించారు. రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తున్న బాధితురాలిని చూసి జాలిపడిన యువకుడు తన కారులో ఆమెను ఇంటి వద్ద దిగబెట్టాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పిల్లలను కూడా కొట్టి హింసించి ఉంటారని అనుమానిస్తున్నారు. బాధితురాలిని చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. భర్త తనపై దారుణానికి పాల్పడ్డాడని.. తన స్నేహితులతో కలసి అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. తనతో మద్యం తాగించి.. సిగరెట్లతో కాల్చి నరకం చూపించారని ఆమె పేర్కొంది. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనపై కేరళ మహిళా కమిషన్ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

Read Also: ఆంటీతో యువకుడి రాసలీలలు.. ఏకాంతంగా దొరికిపోవడంతో..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *