Kim Jong Un: కిమ్ కనిపించాడు సరే.. అజ్ఞ‌ాత‌ంలోకి ఎందుకు? మసకబారుతున్న అణునిరాయుధీకరణ – us president donald trump hails kim reappearance, but north korea denuclearization prospects bleak


మూడు వారాల అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తిరిగి ప్రజల ముందుకు రావడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘ఆయన (కిమ్‌) ఆరోగ్యంగా తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ 15న ఉతర్త కొరియా వ్యవస్థాపకుడు, తన తాత కిమ్ ఇల్ సుంగ్ జయంతి వేడుకలకు హాజరుకాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనేక కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటికీ తెరదించుతూ శుక్రవారం జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కిమ్‌ ప్రత్యక్షమయ్యారు.

ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వీడియోలను విడుదల చేసింది. వీటిలో ఆయన ఎక్కడా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించకపోవడం గమనార్హం. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని ట్రంప్‌ ఆదిలోనే కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా అణునిరాయుధీకరణ అవకాశాలు మసకబారుతున్నాయి. ఏప్రిల్ 11 తర్వతా ఇన్ని రోజులూ కిమ్ ఎక్కడున్నారు? ఏం చేశారనేది? ఎవరికీ తెలియదు. కిమ్ సజీవంగానే ఉన్నాడని అమెరికా నిఘా వర్గాలు బలంగా నమ్మాయి. అయితే, శుక్రవారం నాడు ఉత్తర కొరియా విడుదల చేసిన తీసిన ధ్రువీకరించలేదు.

నిరంతరం అణ్వాయుధ పరీక్షలతో అమెరికాకు కంటిలో నలుసులా మారిన ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకోడానికి అగ్రరాజ్యం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక దశలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళన మొదలైంది. ఈ విషయంలో కిమ్‌పై ఒత్తిడికి అమెరికా చేసిన ప్రయత్నాలు మాత్రం అంతగా ఫలించలేదు. 2018 నుంచి 2019 వరకు మూడుసార్లు కిమ్, ట్రంప్ భేటీ అయ్యారు.

కిమ్‌ను తన స్నేహితుడు అంటూ ట్రంప్ పదే పదే పేర్కొంటున్నా.. మూడు వారాల పాటు ఉత్తర కొరియా అధినేత రహస్యంగా ఉండటం వెనుక ఆంత్యర్యం ఏంటనేది అంతుబట్టడం లేదు. అణ్వాయుధాలను వదులుకోవడానికి ఉత్తర కొరియాను ఒప్పించడంలో విఫలం కావడంతో అమెరికా ఆందోళన చెందుతోంది. అమెరికా వ్యూహాత్మక ప్రత్యర్థి చైనా.. మిత్రదేశాలు దక్షిణ కొరియా, జపాన్‌లతో సరిహద్దులు పంచుకునే ఉత్తర కొరియాలో రాజకీయ గందరగోళం సంభవించినప్పుడు కిమ్‌కు వారసుడు లేకపోవడం అణ్వాయుధ భద్రత గురించి భయాలను మరింత పెంచింది.

ఇదే అంశంపై గతవారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ఉత్తర కొరియాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఆ దేశం అణ్వాయుధాలు కలిగి ఉందని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ, కిమ్ 2017లో తరుచూ అణు పరీక్షలతో వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మూడు వారాలు అజ్ఞ‌ాత‌ంలో ఎందుకున్నారనే? ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *