Kim Yo Jong: ఒకవేళ అదే జరిగితే కిమ్ వారసురాలు ఈమే.. రెండేళ్ల కిందట కీలక పదవి – if not kim jong un, kim yo jong possible heirs to north korea’s throne


ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా నేక కథనాలు వెలువడుతున్నాయి. ఆయనకు ఏమైందనేది స్పష్టంగా తెలియకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకుంది. తండ్రి నుంచి వారసత్వంగా అధికారం పొందిన కిమ్ జోంగ్ ఉన్ (36).. 24 ఏళ్ల వయసులోనే పగ్గాలు చేపట్టాడు. అధినేతగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు దాటింది. కొరియా విడిపోయిన తర్వాత గత ఏడు దశాబ్దాలుగా కిమ్ కుటుంబమే దేశాన్ని పాలిస్తోంది. 1948 నుంచి వారసత్వ పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్‌కు ఏదైనా జరిగితే నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టాలన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నా.. వారికి అధికారం చేపట్టంతే వయసులేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌పై పడింది.

ఆమె నేతృత్వంలోని కమిటీ తాత్కాలికంగా పాలన సాగించే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. కిమ్‌ జోంగ్‌కు కిమ్‌ జోంగ్‌ చోల్‌ అనే సోదరుడు ఉన్నప్పటికీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈయనకు రాజకీయాల కంటే గిటార్ వాయించడమే ఎక్కువ ఇష్టం. ఉత్తర కొరియాలో గతంలో అధికార ఘర్షణలు జరిగాయి. దేశ ద్రోహం, అవినీతి ఆరోపణలపై తన బంధువు, మార్గదర్శకుడు అయిన జాంగ్‌ సాంగ్‌ థేక్‌ను కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 2013లో ఉరితీయించారు. తద్వారా అధికారంపై పట్టును పెంచుకున్నారు.

దశాబ్దాలుగా అధికారం చలాయిస్తున్నా తమ కుటుంబమే భవిష్యత్తులోనూ ఆధిపత్యం కొనసాగించేలా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కిమ్ ప్రణాళికలు రూపొందించారు. కుటుంబ ఆధిప‌త్యాన్ని పటిష్టం చేయడానికి అధికార వర్కర్స్‌ పార్టీలో తన సోదరి కిమ్‌ యో జాంగ్‌కు రెండున్నరేళ్ల కిందటే ఉన్నత పదవిని కట్టబెట్టారు. వర్క్‌ర్స్‌ పార్టీ 72వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తరకొరియాలో వారోత్సవాలు నిర్వహించి, ఆ కార్యక్రమంలో కిమ్‌ యో జాంగ్‌ను పార్టీ సెంట్రల్‌ కమిటీ నిర్ణయాత్మక మండలిలో ప్ర‌త్యామ్నాయ‌ సభ్యురాలిగా ఎన్నుకున్నారు.

చెల్లెలను నాయకత్వ బాధ్యతలకు మరింత దగ్గరగా తీసుకొచ్చేందుకు కిమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 32ఏళ్ల కిమ్‌ యో జాంగ్‌ తన సోదరుడితో కలిసి తరచుగా మీడియాలో కన్పిస్తుంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దక్షిణ కొరియా వేదికగా 2018లో జరిగిన భేటీకి కూడా యో హాజరయ్యింది. కొరియా రెండుగా విడిపోయిన తర్వాత ఉత్తర కొరియాకు చెందిన అధికార కుటుంబంలోని ఓ మహిళ దక్షిణ కొరియాను సందర్శరించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 11న జరిగిన సమావేశంలోనూ కిమ్ జోంగ్ ఉన్ అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు ఆయన తండ్రి కింగ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సుంగ్ పాలించారు. తండ్రి మరణం తర్వాత అధికారం చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్.. గాయని రి సుల్ జూ‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

ఇక, కిమ్ మేనల్లుడు కిమ్ హాన్ సోల్ దేశం నుంచి బహిష్కరించబడకపోతే వారసుడిగా స్పష్టంగా తెరపైకి వచ్చేవాడు. కిమ్ హాన్ సోల్ ఉత్తర కొరియాకు రావాలని ప్రయత్నించాడు. అయితే, అతడి తండ్రి 2017లో కౌలాలంపూర్ విమానాశ్రయంలో హత్యకు గురయ్యారు. దీంతో హాన్ సోల్‌ను కూడా హత్య చేస్తారనే అనుమానంతో చైనా పోలీసుల అనేక మంది ఉత్తర కొరియన్లను అరెస్టు చేసినట్లు దక్షిణ కొరియాకు చెందిన జోంగ్ ఆంగ్ ఇల్బో పత్రిక ఆ సమయంలో నివేదించింది. ఇప్పటి వరకూ హన్ అతడి ఆచూకీ తెలియదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *