kissing benefits: ఆఫీస్‌కి వెళ్లే ముందు ఇలా చేస్తే ఎక్కువ జీతం వస్తుందట.. – stunning health benefits of kissing you need to know


1.మీ భార్యని ముద్దు పెట్టుకోవడం మీ జీవితకాలాన్ని పెంచుతుంది – అధ్యయనంఇద్దరు ప్రేమికులూ, లేదా జీవిత భాగస్వాములూ వారి ప్రేమని వ్యక్తపరిచే వివిధ పద్ధతుల్లో అన్నిటికన్నా ఎక్కువ సాన్నిహిత్యాన్ని పెంచేదీ, రొమాంటిక్ గా ఉండేదీ ముద్దు పెట్టుకోవడమే. ఇది ఇద్దరు మనుషుల సామీప్యాన్నే కాదు, సాన్నిహిత్యాన్ని కూడా పెంచి వారి మానసిక అనుబంధానికి తోడ్పడుతుంది. ముద్దు వల్ల కలిగే లాభాల గురించి చాలా పరిశోధనలే జరిగాయి. ముద్దు వల్ల మనుషుల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయనీ, సంతోషంగా ఉంటారనీ, మంచి అనుభూతికి లోనవుతారనీ పరిశోధకులు నిరూపించారు. అంతే కాదు, కొద్ది కాలం క్రితం జర్మనీ లో శాస్త్రవేత్తలు ముద్దు వల్ల జీవితాన్ని మలుపు తిప్పే లాభాలున్నాయని తేల్చారు. అవేమిటో చూడండి మరి.

Also Read: ఈ టీతో త్వరగా జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి..

2. చుంబన మీ జీవితకాలాన్ని పెంచుతుంది

1980 ల లో జర్మనీ లో ఒక మానసిక అధ్యయనం జరిగింది. రెండు సంవత్సరాల సుదీర్ఘమైన పరిశోధనల తరువాత శాస్త్రవేత్తలు కొన్ని అద్భుతమైన విషయాలను కనుగొన్నారు. వాటిలో ఒకటి రోజూ ఆఫీస్ కి బైల్దేరేముందు వారి భార్యలను ముద్దు పెట్టుకుని వెళ్ళే భర్తల జీవితకాలం (సుమ్మరు ఐదు సంవత్సరాలు) అలా చెయ్యని భర్తల జీవితకాలం కంటే ఎక్కువగా ఉంది.

Also Read: కర్పూరం రాస్తే జుట్టు పెరుగుతుందా..

3. ఇంకొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు

ఇంకా ఆ పరిశోధన ప్రకారం, ఆఫీస్ కి వెళ్ళేముందు భార్యలని ముద్దాడి వెళ్ళే భర్తలు, అలా చేయని భర్తల కంటే ఇరవై నించీ ముప్ఫై శాతం ఎక్కువ ఆదాయం పొందుతారు. జర్మనీలో సుమారుగా నూటపది మంది పైస్థాయి ఇండస్ట్రియల్ మేనేజర్లు ఈ అధ్యయనం లో పాలు పంచుకున్నారు. వారిచ్చిన వివరాల ప్రకారం ఇంటినించి బయల్దేరే ముందు భార్యలని ప్రేమగా ముద్దాడే వారిలో ఎనభై ఏడు శాతం మందికి జీతం పెరిగింది. వారు మంచి పదవులలో కూడా ఉన్నారు.

Also Read: గుడ్డు ఉడకబెట్టి తింటే మంచిదా.. పచ్చిగానే తీసుకోవాలా..

4. ప్రధాన పరిశోధకుని మాట

ఈ అధ్యయన ఫలితాలు పశ్చిమ జర్మనీ లోని సెలెక్టా అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ అధ్యయనానికి సారధ్యం వహించింది యూనివర్సిటీ ఆఫ్ కీల్ లో సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్థర్ సాబొ. డాక్టర్ ఆర్థర్ క్లుప్తీకరించిన ఫలితాల ప్రకారం, “భర్తలు భార్యలని మూద్దాడకుండా ఇంట్లోనించి బైల్దేరారంటే దానర్ధం వారి మధ్య గొడవైనా జరిగింది, లేదా కనిపించని దూరమైనా పెరిగింది. ఏ కారణమైనా భర్త ఒక ప్రతికూల ధోరణితో తన రోజుని మొదలుపెడుతున్నాడు. చేసే పని మీదా, చుట్టుపక్కల పరిసరాల మీదా అతనికి ఎలాంటి ఆసక్తీ ఉండదు. చాలామంది వారి భార్యల పట్ల ఉదాసీనత ని నటించినా వారందరూ వారిని వారు మోసం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి తన భార్యని ప్రేమించకున్నా, ఆమె ధోరణి తాలూకు ప్రభావం అతని మీద ఉంటుంది. మా పరిశోధన దీన్ని నిర్ద్వందంగా నిరూపించింది. తన భార్యని ప్రేమగా చుంబించి ఆఫీస్ కి వెళ్ళే భర్త సానుకూల దృక్పథం తో తన రోజుని మొదలుపెడుతున్నాడు. అతని సామరస్య ధోరణి శారీరకంగా మానసికంగా ప్రభావాన్ని చూపిస్తుంది”.

కాబట్టి పురుషపుంగవులు అర్థమైందిగా.. ముద్దు కేవలం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. ఆర్థికంగానూ హెల్ప్ చేస్తుందట.. మరింకెందుకు ఆలస్యం..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *