kothapally man death: తండ్రికి పిండ ప్రదానం చేస్తూ కొడుకు మృతి – man dead after fell into a pond in karimnagar’s kothapally


చనిపోయిన తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న కుమారుడు అందరి కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగింది. కొత్తపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురికాలనీకి చెందిన అన్ రెడ్డి కొండల్ రెడ్డి అనే వ్యక్తి 12 రోజుల క్రితం చనిపోయాడు. అతడి కొడుకులు అన్ రెడ్డి పురేందర్ రెడ్డి (48), అన్ రెడ్డి ప్రణవేందర్ రెడ్డి (45) పిండ ప్రదానం చేసేందుకు చెరువు వద్దకు వచ్చారు. చెరువులో దిగి పిండాలు కలుపుతుండగా పురేందర్ రెడ్డి కాలుజారి పడ్డాడు. చేపలు పట్టేవాళ్లు బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు.

సోదరుడు నీళ్లలో మునిగిపోవడంతో ప్రణవేందర్‌రెడ్డి గట్టిగా కేకలు వేశాడు. అక్కడే ఉన్న చేపలు పట్టే వ్యక్తి గమనించి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చెరువులో మునిగిపోయిన పురెందర్‌రెడ్డిని నీళ్లలో నుంచి బయటకు తీశాడు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *