ktr: పారిశుద్ధ్య సిబ్బందికి మంత్రి కేటీఆర్ హెల్త్ కిట్ల పంపిణీ – minister ktr distributes health kits to sanitation staff in ghmc


కోవిడ్ -19 నియంత్రణలో జీహెచ్ఎంసీలోని శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. సోమవారం ఫతుల్లాగూడలోని యానిమల్ కేర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బందికి ఆయన హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. ప్రస్తుతం రూ.13 కోట్ల వ్యయంతో 22 వేల మంది శానిటేషన్, 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి హెల్త్ కిట్స్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. కిట్స్‌ను రెగ్యులర్‌గా వినియోగించాలని సిబ్బందికి మంత్రి సూచించారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టడంలో శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి సిబ్బంది సేవ‌ల‌ను గుర్తించి ప్రభుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, రక్షణతో పాటు కుటుంబ స‌భ్యులు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇంటి వ‌ద్ద కూడా త‌గు జాగ్రత్తలు తీసుకోవాల‌ని తెలిపారు.
గతంలో అత్యవసరంగా 1,80,000 మాస్కులు, 27 వేల హ్యాండ్ గ్లోవ్స్, 25 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్‌ను.. శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బందికి సర్కిళ్ల వారిగా పంపిణీ చేసిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ మంత్రికి వివ‌రించారు. మూడు వారాల్లో అందరికి హెల్త్ కిట్స్ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా యానిమల్ కేర్ సెంట‌ర్ నిర్వహణను మంత్రి ప‌రిశీలించారు.

అదేవిధంగా ఎంట‌మాల‌జీ విభాగంలో ఏర్పాటు చేసిన దోమ‌ల నివార‌ణ స్టాల్‌ను సంద‌ర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, కార్పొరేట‌ర్ సంగీత‌, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్ రాహుల్ రాజ్ జడ్‌సీ ఉపేందర్ రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు పాల్గొన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *