kurnool girl rape: కామ కోరికలతో రెచ్చిపోయిన 13ఏళ్ల బాలుడు.. ఐదేళ్ల చిన్నారిని దారుణంగా – 13 yr old arrested in kurnool town over rape attempt on girl


ఐదేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడిన 13ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన కర్నూలు పట్టణంలో చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన బాలుడు నంద్యాలలోని ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు మూతపడటంతో ఇంటికి వచ్చేశాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆ బాలుడు మిద్దెపై పడుకున్నిడు. వీరి పక్కింట్లో కుటుంబ సభ్యులు తమ ఐదేళ్ల పాపతో కలిసి వారి ఇంటిపై నిద్రించారు.

Also Read: సంసారంలో అక్రమ సంబంధం చిచ్చు.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

ఆదివారం ఉదయం బాలిక ఇంకా నిద్రిస్తుండటంతో మిద్దెపైనే వదలి తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పక్క మిద్దెపై ఉన్న బాలుడు చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పాప గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు మేడపైకి వచ్చేసరికే బాలుడు పరారయ్యాడు. పాపకు రక్తస్రావం కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. జననాంగాల వద్ద గాయాలున్నట్లు గుర్తించిన డాక్టర్లు ఆమెపై అత్యాచారయత్నం జరిగినట్లు తెలిపారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లైంగిక కోరికలు తీర్చుకుని



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *