liquor shops open in green zones: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం అమ్మకాలకు ‘గ్రీన్’ సిగ్నల్, నిబంధనలివే – lockdown extension: liquor shops can open in green zones after may 3


దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ గడువును కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. దీంతో మే 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. రెడ్ జోన్లలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు కానుండగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా మందుబాబులకు కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. గ్రీన్ జోన్ల పరిధిలోని పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

మద్యం అమ్మకాలకు కేంద్రం నిబంధనలను విధించింది. షాపుల దగ్గర ఐదుగురి కంటే ఎక్కువగా ఉండొద్దని.. ఒక్కొక్కరి మధ్య రెండు గజాల దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.కేంద్రం ఆదేశాలతో మే 4 నుంచి గ్రీన్ జోన్లలో లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. కానీ రాష్ట్రాలు కూడా దీనికి అంగీకారం తెలపాల్సి ఉంటుంది.

మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రాగా.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. మద్యం దొరక్కపోవడంతో చాలా మంది మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరైతే అసలు ధరకు నాలుగింతలు ఎక్కువ ఖర్చు పెట్టి బ్లాక్‌లో మద్యాన్ని కొనుగోలు చేశారు. ఎక్కువ ధర పెట్టినా మద్యం దొరక్కపోవడంతో కల్లు, నాటుసారాల వైపు కూడా కొందరు మందుబాబులు మళ్లారు. కేరళ లాంటి రాష్ట్రాలు పరిమితంగా మద్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా.. న్యాయస్థానాలు, కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు చేపట్టొద్దని రాష్ట్రాలకు సూచించింది.

Also Read:లాక్‌డౌన్ 3: ఏమేం చేసుకోవచ్చు? వేటికి అనుమతి లేదు?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *