lockdown guidelines : నేటి నుంచే అమల్లోకి లాక్‌డౌన్ మినహాయింపులు.. ఈ కార్యకలాపాలకే అనుమతి – several key sectors of the economy to begin from monday, centre given nod for limited activities


ప్రజల ప్రాణాలను కాపాడుకుంటేనే ప్రగతి రథాన్ని పట్టాలెక్కించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దాని అనుబంధ రంగాలు… మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. వీటితోపాటు మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలవుతాయి.


మిగతా 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులకు వెసులుబాటు లభిస్తుంది. అన్ని వస్తువుల సరఫరాకు ఈ-కామర్స్‌ సంస్థలకు ఇటీవల మినహాయింపునిచ్చిన కేంద్రం.. ఆదివారం ఈ అనుమతులను రద్దు చేసింది. అత్యవసర కాని వస్తువుల సరఫరా చేయరాని, అవసరమైన వాటికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

కేంద్రం మినహాయింపులు ఇచ్చినా తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌన్ ఆంక్షల్ని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. కార్యకలాపాలు పునః ప్రారంభించే సమయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. వెసులుబాట్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితిని యతాతథంగా కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని సూచించింది. అవసరమని భావిస్తే కేంద్రం విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే బాగా తెలుస్తాయి కాబట్టి అదనపు జాగ్రత్తలు, చర్యలు తీసుకొనే అధికారం వాటికే వదిలిపెట్టింది.

నేటి నుంచి పునఃప్రారంభించే కార్యకలాపాలు ఇవే

నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దుచేసింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు.

సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం, మతప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలను కూడా నిలిపివేసింది. ట్యాక్సీ సర్వీసులకు కూడా అనుమతి నిరాకరించింది.

హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవు.

ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా సాగుతాయి. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతులు.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలు.. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలు.. ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలు.

బ్యాంకు కార్యకలాపాలకు అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది.

ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులు.. సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.

ఎరువులు, పురుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరుచుకుంటాయి.

పాల ఉత్పత్తులు, వ్యాపారాలు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగు.

జాతీయ రహదారులు పక్కన దాబాలు, వాహన మరమ్మత్తుల దుకాణాలకు కేంద్రం అనుమతించింది.

ఐటీ సంస్థల్లో 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతి.

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం.

వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి.

ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి

రక్షణ, పారామిలటరీ, ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ, విపత్తు నిర్వహణ, ఎన్ఐ‌సీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, యువ కేంద్రాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లోని డిప్యూటీ సెక్రెటరీలు అంతకంటే ఎక్కువస్థాయి అధికారులు 100 శాతం హాజరుకావాలి.. మిగతా అధికారులు, ఇతర సిబ్బంది 33 శాతం వరకూ ఆఫీసులకు హాజరుకావాలని సూచించింది. ఇవన్నీ ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సహా గుట్కాలు, ఖైనీ, మద్యపానం నిషేధం. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులవుతారు.

పనులు ప్రారంభించే భారీ పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక సముదాయాల ప్రాంగణాల్లోనే కార్మికులకు వసతి సౌకర్యాలు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్దేశించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *