locust bread: మిడతల పొడితో బ్రెడ్.. ప్రోటీన్లు పుష్కలం! – this bread in finland is made of dried crickets or locust


ప్పుడు దేశమంతా మిడతలు గురించే చర్చ. పంటలపై దాడులు చేస్తున్న ఈ మిడతలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30 వేల మందికి సరిపడా ఆహారాన్ని ఒక్క రోజులోనే మింగేస్తున్నాయి. దీంతో మిడతలను ఎదుర్కోడానికి రైతులు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. తమకు తోచిన విధానాల్లో మిడతలను తరిమి కొడుతున్నారు. మరోవైపు రాజస్థాన్‌లో మిడతలను బిర్యానీ చేసుకుని తినేస్తున్నారు. ఛీ, మిడతలను తినేస్తున్నారా అని చీదరించుకోవద్దు. ఈ మిడతల్లో బోలెడన్ని ప్రోటీన్లు ఉంటాయి. నమ్మబుద్ధి కావడంలేదా? అయితే, తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే.

ఫిన్‌ల్యాండ్‌లోని ఫజేర్ బేకరీ నిర్వాహకులు మిడతలు కనిపడితే చాలు.. వాడిని పొడిగా చేసి మరీ వంటకాల్లో వాడేస్తున్నారు. అక్కడ తయారు చేసే బ్రెడ్లలో మిడతల పొడిని వాడుతున్నారు. మిడతాలను బాగా ఎండబెట్టి, పిండి చేసి.. ఆ మిశ్రమాన్ని బ్రెడ్‌ తయారీకి ఉపయోగించే పిండిలో కలుపుతున్నారు. దాన్ని బాగా బేక్ చేసి (దోరగా వేయించి) వినియోగదారులకు అందిస్తున్నారు.

ఫిన్‌ల్యాండ్‌ కొన్నేళ్లుగా పురుగులను ఆహారంగా తీసుకోవడపై నిషేదం విధించింది. ఇటీవల నిషేదం ఎత్తేయడంతో పురుగుల తినే ఆహార ప్రియులు.. వాటితో వెరైటీలు తయారు చేసుకుని తింటున్నారు. ఈ నేపథ్యంలో ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఫజేర్ బేకరీ మిడతల పొడితో బ్రెడ్ తయారీని మొదలుపెట్టింది. ఈ పొడిని నెదర్లాండ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

Also Read: మిడతలతో బిర్యానీ.. రాజస్థాన్ రెస్టారెంట్లలో విక్రయం, మీరూ ట్రై చేయండి!

ఈ సందర్భంగా బేకరీ సీఈవో మార్కస్ హెల్‌స్ట్రామ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సరికొత్త ప్రయత్నంతో ఆహారంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాం. అందుకే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రోటీన్లతో కూడిన మిడతల పొడితో బ్రెడ్ తయారు చేశాం’’ అని తెలిపాడు. ఈ బ్రెడ్‌ను రుచి చూసిన ఓ మహిళ మాట్లాడుతూ.. ‘‘ఇది సాధారణ బ్రెడ్ తరహాలోనే ఉంది. రుచిలో పెద్ద తేడా ఏమీ కనిపించలేదు’’ అని తెలిపింది. అయితే, వీరు బ్రెడ్ తయారీకి వాడుతున్న మిడతలకు, దేశంపై దండెత్తిన మిడతలకు తేడా ఉంది. ప్రస్తుతం మన దేశంపై దండెత్తిన మిడతలు పంట పొలాల్లో ఎక్కువగా ఉండే గడ్డిపురుగు తరహా మిడతలు. వీటిలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Also Read: గొంగళి పురుగుతో వయాగ్రా.. మొండి రోగాలను మాయం చేసే దివ్యౌషధం

మీకు తెలుసా?: ప్రపంచంలో 2 బిలియన్ ప్రజలు పురుగులను ఆహారంగా తింటున్నారు. చైనాతోపాటు మెక్సికో, బ్రెజిల్, ఘనా, థాయ్‌లాండ్ దేశీయులు ఎక్కువగా పురుగులను తింటారు. పురుగులు తినేందుకు రుచిగా ఉండటమే కాకుండా అందులో బోలెడన్ని ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ B12 ఉంటాయి.

గమనిక: పురుగులు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కొందరికి అలర్జీలు కలిగించే ప్రమాదం ఉంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. కొత్తగా ఇలాంటివి తింటే ఆరోగ్యం పాడయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటమే ఉత్తమం అని గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *