locust effect on flights: మిడతలతో కొత్త ముప్పు.. విమానాలకూ ప్రమాదం, డీజీసీఏ అలర్ట్ – locust threat to flights, dgca issues guidelines to pilots


మిడతల దండుతో కొత్త ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఎడారి పురుగులతో పంటలకే కాదు.. విమానాలకూ ముప్పు ఏర్పడింది. విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఈ మిడతల దండు వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పేర్కొంది. మిడతల దండు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పైలట్లకు, ఇంజినీర్లకు శుక్రవారం (మే 29) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

మిడతలు తక్కువ ఎత్తులో ఎగురుతాయి కాబట్టి విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని డీజీసీఏ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సమయంలో విమానాల్లోని అన్ని ప్రవేశ ద్వారాల్లోకి ఇవి పెద్ద సంఖ్యలో చొచ్చుకెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.

మిడతల దండు మీదుగా ప్రయాణించినప్పుడు విమానానికి చెందిన పిటాట్‌, స్టాటిక్‌ నాళాలు (గాలి వేగాన్ని అంచనా వేసే పరికరాలు) పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. అవి మూసుకుపోతే వాటి నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయని, ఎయిర్‌ స్పీడ్‌, అల్టీ మీటర్‌ సూచీలు సరిగా పనిచేయకపోవచ్చని తెలిపింది. అయితే.. రాత్రివేళ్లలో ఈ గుంపు సంచరించకపోవడమనేది ఊరట కల్పించే అంశమంటూ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *