LPG cylinder price hike: ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి! – lpg gas cylinder price raised, check latest rates here


మధ్యతరగతి ప్రజలకు ఒకటో తేదీ షాక్. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. గ్యాస్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సిలిండర్ ధర రూ.100కు పైగా పైకి కదిలింది. దీంతో సిలిండర్ వినియోగదారులపై ప్రభావం పడనుంది. జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.

సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.11.5 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కు చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.110 ఎగసింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కు ఎగసింది. ఢిల్లీలో ఈ రేట్లు వర్తిస్తాయి. ఇక మే నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.744 నుంచి రూ.581కు తగ్గిన విషయం తెలిసిందే.

Also Read: షాకిస్తున్న బంగారం ధర.. వెండి భారీ షాక్.. లేటెస్ట్ రేట్లు ఇలా!

ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర (14.2 కేజీలు) రూ.581 నుంచి రూ.593కు చేరింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.616కు, ముంబైలో సిలిండర్ ధర రూ.590కు, చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.606కు ఎగసింది. అన్ని రాష్ట్రాల్లోనూ 19 కేజీల సిలిండర్ ధర కూడా పెరిగింది.

Also Read: Bank కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకులకు 30 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

కాగా కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి కుబుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు వర్తిస్తుంది. ఏడాదిలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ మొత్తం రాదు. సిలిండర్ ధర ఎంత ఉందో అంతే చెల్లించాలి.

ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ధర తగ్గొచ్చు. పెరగొచ్చు. లేదంటే అలాగే కూడా ఉండొచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *