LPG gas cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? మీకు రూ.50 లక్షల బెనిఫిట్! – gas cylinder insurance cover up to rs 50 lakh, know the claim process


గ్యాస్‌ సిలిండర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన టైమ్ బాగోలేకపోతే సిలిండర్ పేలిపోయే ప్రమాదముంది. సిలిండర్ పేలితే కలిగే నష్టం చాలా భారీగానే ఉంటుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వంటివి సంభవిస్తాయి. అందువల్ల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారు జాగ్రత్తగా ఉండాలి. పలు సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి.

ఒకవేళ గ్యాస్ సిలిండర్ పేలితే కన్సూమర్లకు ఉండే హక్కులు, అధికారులు ఏంటివో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ముఖ్యం. గ్యాస్ సిలిండర్ పేలితే దానికి డీలర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. నేషనల్ కన్సూమర్ ఫోరమ్ గతంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. డీలర్లు లోపభూయిష్ట సిలిండర్‌ను కన్సూమర్‌కు సరఫరా చేస్తే.. అప్పుడు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల డీలర్లు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే ముందు పూర్తిగా చెక్ చేసుకోవాలి.

Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్.. లేటెస్ట్ రేట్లు ఇలా!

గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల కన్సూమర్లక రూ.50 లక్షల వరకరు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ.10 లక్షలు లభిస్తాయి. ఎల్‌పీజీ సిలిండర్ ఇన్సూరెన్స్ బీమా పొందాలంటే కస్టమర్ వెంటనే ఆ విషయాన్ని దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి. అలాగే ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు కూడా విషయాన్ని చేరవేర్చాలి.

Also Read: SBI హెచ్చరిక.. కస్టమర్లకు అలా చేయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయిన ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ కచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఇందులో ఉంటుంది. ఈ పాలసీ కస్టమర్ల అందరికీ వర్తిస్తుంది. దీనికి వినియోగదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు.

ఎఫ్ఐఆర్, మెడికల్ బిల్స్, డెత్ సర్టిఫికెట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇన్సూరెన్స్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌కు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ డబ్బులు అక్కడి నుంచి కన్సూమర్‌కు చేరతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *