lucknow teacher murder: స్కూల్లో లేడీ టీచర్‌ దారుణ హత్య.. మాజీ ప్రియుడే.? – woman teacher shot dead by male colleague in uttar pradesh


మహిళా ఉపాధ్యాయురాలిని ఆమె సహోద్యోగిని స్కూల్లోనే పట్టపగలు తుపాకీతో కాల్చి చంపేసిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బుల్లెట్లు ఆమె శరీరంలో నుంచి దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ దారుణ ఘటన యూపీలోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. పకారియాకి చెందిన ఆరాధన రాయ్(35) ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. అదే స్కూల్లో పనిచేస్తున్న అమిత్ కౌశల్ ఆమెను తుపాకీతో కాల్చిచంపాడు.

క్యాజువల్ లీవ్‌లు రిజస్టర్‌లో నమోదు చేసే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహం చెందిన అమిత్ తుపాకీతో కాల్చేశాడు. రెండుసార్లు ఆమెపై కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మృతురాలు ఆరాధన రాయ్‌, నిందితుడు అమిత్ కౌశల్ మధ్య లవ్ ఎఫైర్ నడిచినట్లు తెలిసిందని సీతాపూర్ ఎస్పీ ఆర్పీ సింగ్ తెలిపారు. అయితే అది ఎక్కువ కాలం కొనసాగలేదని.. అమిత్‌తో విభేదాలు రావడంతో ఆరాధన స్కూల్ అథారిటీకి ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు. అతనిపై విచారణ జరిపిన స్కూల్ అథారిటీ అమిత్‌కి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తుపాకీతో కాల్చి చంపేసి ఉంటాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Guntur: భార్య న్యూడ్ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టిన భర్త.. దారుణం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *