Madhavi Latha: రాకేష్ మాస్టర్‌కి మాధవీలత లీగల్ నోటీసులు.. క్షమాపణ చెప్పలేదో..! – actress, bjp leader madhavi latha sends legal notice to rakesh master


రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా కన్నా పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీలో చాలా మందిపై ఆయన వివాదాస్పద, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చెలరేగిపోయారు. ఇండస్ట్రీ పెద్దలపై కూడా ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలపై మాధవీలత ఘాటుగానే స్పందించారు. ఆయనకు లీగల్ నోటీసు పంపించారు. అడ్వకేట్ మన్నవ్ కుమార్ ద్వారా ఈ నోటీసును రాకేష్ మాస్టర్‌కు మాధవి పంపారు.

రాకేష్ మాస్టర్ ఈనెల 6న రెండు యూట్యూబ్ ఛానెళ్లలో వీడియోలను అప్‌లోడ్ చేశారని, ఆ వీడియోల్లో మాధవీలతపై నిరాధారమైన, అసత్యపూరితమైన ఆరోపణలు చేశారని, అసభ్యకర పదజాలం వాడారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా, మాధవీలతను ‘జప్ఫాదాన’, ‘అత్తాపూర్’, ‘బుడబుక్కలదాన’, ‘ముదనష్టపుదాన’ అనే తిట్లతో పాటు అసభ్యకర పదజాలంతో దూషించారని నోటీసులో అడ్వకేట్ పేర్కొన్నారు.

Also Read:టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు అరెస్ట్

తెలుగులో ప్రముఖ నటులైన చిరంజీవి, బాలకృష్ణలతో మాధవీలతకు లింకులు పెట్టడంతో పాటు ఆమె గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడారని వెల్లడించారు. ఇలా, ఆ వీడియోల్లో మాధవీలతపై చేసిన తప్పుడు వ్యాఖ్యలన్నింటికీ రాకేష్ మాస్టర్ సమాధానం చెప్పాలని నోటీసులో కోరారు. ఒక మహిళపై అసత్యపూరిత ఆరోపణలు చేయడం, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించడం పట్ల ఐపీసీ సెక్షన్ 499, 500, సెక్షన్ 354ల కింద రాకేష్ మాస్టర్‌పై కేసులు పెడతామని హెచ్చరించారు.

మరోవైపు, ఈ లీగల్ నోటీసుపై మాధవీలత స్పందించారు. ఎలాంటి కారణం లేకుండా రాకేష్ మాస్టర్ తనపై పబ్లిక్ మీడియాలో అసభ్యకర పదజాలంతో తిట్టిపోశారని మాధవి అన్నారు. అసలు ఆయనతో వ్యక్తిగతంగా తనకు పరిచయం లేదని చెప్పారు. ఆయన మాటలు తనకు చాలా బాధ కలిగించాయని, కొన్ని రోజులు నిశ్శబ్దంగానే ఉన్నా ఆయనకు గట్టిగా సమాధానం చెప్పాలని ఇప్పుడు నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఓ పబ్లిక్ మీడియాలో అయితే తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారో.. అక్కడే తనకు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తానని, కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు.

Also Read:‘మ్యాడ్’ మూవీలో కైలాష్ ఖేర్ పాడిన సుఫీ పాట.. కొత్తగా ఉంది!

ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే.. చాలా మంది దానిని ఎంజాయ్ చేస్తూ అతనికి పిచ్చి అని కామెంట్లు పెడుతున్నారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అతనికి పిచ్చి అని డాక్టర్ నుంచి తనకు సర్టిఫికెట్ కావాలని అన్నారు. దీనిపై ఇంతకు మించి మాట్లాడనని, ఏదైనా చట్టపరంగానే వెళ్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, తన అడ్వకేట్ సహాయంతో రాకేష్ మాస్టర్‌కు లీగల్ నోటీసు పంపించానని చెప్పారు.
రాకేష్ మాస్టర్‌కు మాధవీలత పంపిన లీగల్ నోటీసు.. క్లిక్ చేయండిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *