malaria treatment: మలేరియా వచ్చాక ఈ ఫుడ్ తింటే త్వరగా కోలుకుంటారట.. – what to eat and avoid during malaria know here treatment details in telugu


ఇండియా లాంటి ట్రాపికల్ ప్లేసెస్ లో నివసించేవారికి మలేరియాని పరిచయం చేయనక్కరలేదు. ఇది దోమ కాటు నుండి వస్తుందని మనకి తెలుసు. చాలా మందికి తెలియనిది ఏమిటంటే మలేరియాకి మెడిసిన్స్ తీసుకోవడం ఆపేసిన తర్వాత కూడా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రికవరీ కి ఎక్కువ టైమ్ పడుతుంది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి రికవర్ అవ్వాలన్నా సమతులాహారం కంపల్సరీ. ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండి ఉన్న ఆహారం శక్తిని ఇవ్వడమే కాక రికవరీ కూడా త్వరగా జరిగేలా చూస్తుంది. మలేరియా కి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

మలేరియా దోమ కాటు నించి వస్తుంది. మలేరియా సోకిన వ్యక్తి శరీరం లోని బ్లడ్ ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గుతాయి. ఇందు వల్ల జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తాయి. నీరసం గా అనిపిస్తుంది. ఒక సారి హై ఫీవర్, తగ్గిన తరువాత విపరీతమైన చెమట కూడా ఉంటాయి. వికారంగా ఉండవచ్చు, వాంతులు కావచ్చు.

Also Read : అలోవేరా రాస్తే తామర తగ్గుతుందా..

1. నీరు..

నీరు బాగా తాగాలి. కొబ్బరి నీరు, నిమ్మ రసం, నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా, కమలాపండ్లు వంటివి కూడా తీసుకోవచ్చు. నీరు బాడీలో నుండి టాక్సిన్స్ ని ఫ్లష్ ఔట్ చేసేసి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కాక, మలేరియా వచ్చి తగ్గిన తర్వాత చాలా మందికి ఆకలి ఉండదు, అసలేమీ తినాలనిపించదు. అలాంటప్పుడు ఈ కొబ్బరి నీరు, కమలాపండు వంటివి బాగా హెల్ప్ చేస్తాయి. నోటికి రుచిగా ఉండడం వల్ల ఇవి తీసుకోగలుగుతారు.

2. హెల్దీ ప్రోటీన్స్..

మలేరియా మజిల్ లాస్ కి దారి తీయగలదు. ఇందు వల్ల మలేరియా సోకిన వ్యక్తి బాగా నీరసపడిపోతారు. అందుకే ఆహారం లో హెల్దీ ప్రోటీన్ ని చేర్చుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది. ప్రోటీన్ ని బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్ అంటారు. ప్రతి సెల్ కీ, టిష్యూ కీ ప్రోటీన్ కావాలి, అప్పుడే అవి తమని తాము రిపెయిర్ చేసుకోగలుగుతాయి. అందుకని ఈ సమయం లో కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకుంటే రికవరీ వేగంగా జరుగుతుంది. గింజలు, నట్స్, గ్రీన్ వెజిటబుల్స్, డైరీ ప్రోడక్ట్స్ లో ప్రోటీన్ ఉంటుంది.

Also Read : టీతో తినడానికి రస్క్స్ ఇంట్లోనే చేసుకోండిలా..

3. ఫ్యాట్‌కి దూరం..

రకరకాల పనులు చేయడానికి శరీరానికి కార్బ్స్, ప్రోటీన్ లాగానే ఫ్యాట్స్ కూడా అవసరమే. కానీ, ఈ సమయంలో ఫ్యాట్స్ ని కొంచెం తగ్గించే తీసుకోవాలి. ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫ్రైడ్ ఫుడ్ లాంటివి ఇండైజెషన్ కి గురి చేయవచ్చు. ఇది అనవసరమైన కాంప్లికేషన్. అలాగే, ఒమేగా-3 ఉండే హెల్దీ ఫ్యాట్ ని తీసుకోండి. ఒమేగా-3 ఫ్యాట్స్ లో యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి బాడీ లో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి.

4. ఇవి తినొద్దు..

ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్, స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ పూర్తియా ఎవాయిడ్ చేయండి. కాఫీ, టీ, ఫిజ్జీ డ్రింక్స్, కెఫినేటెడ్ బివరేజెస్ కూడా ఎవాయిడ్ చేయండి. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయలూ కూడా ఈ సమయం లో ఎవాయిడ్ చేయాలి.

మలేరియా నుండి త్వరగా కోలుకోవడానికి తేలికగా ఉండి త్వరగా అరిగే ఫుడ్ తీసుకోవడం అవసరం.

Also Read : కేక్ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి..

ఇప్పుడు మలేరియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

దోమలు ఎక్కువగా ఉండే సీజన్ లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

1. మస్క్విటో రిపెల్లెంట్స్ ని అప్లై చేయడం.
2. దోమ తెరలు కట్టుకుని ఆ లోపల నిద్రపోవడం.
3. కాళ్ళూ చేతులూ పూర్తిగా కవర్ అయ్యేలా ఉండే బట్టలు ధరించడం.
4. సాయంత్రం నుంచీ తలుపులూ కిటికీలూ స్క్రీన్ చేయడం.
5. ఒంటికి పట్టుకుని ఉండే బట్టలు కాకుండా కొద్దిగా లూజ్ గా ఉండేవి వేసుకోవడం.
6. సాయంత్రం అయిన దగ్గర నుండీ ఇంటి లోపలే ఉండడం.
7. రాత్రి పూట ఫ్యాన్ ఆన్ చేసుకుని పడుకోవడం.
8. ఇంటి చుట్టుపక్కలా, పెరట్లో ఎక్కడా కూడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవడం.

మలేరియా రాకుండా ఉండాలంటే దోమ కుట్టకుండా జాగ్రత్తపడాలి, అంతే. మీకు మలేరియా సోకినట్లు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *