Manish Pandey: ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్.. నా బ్యాగ్‌లో: భారత క్రికెటర్ పాండే – i have 5 girlfriends in my bag but only 1 in real life: manish pandey


భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే గత ఏడాదికాలంగా టీమిండియాలో నిలకడగా రాణిస్తున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కి అవకాశం దక్కించుకోలేకపోయిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి మళ్లీ భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకూ భారత్ తరఫున 26 వన్డేలు, 38 టీ20లు ఆడిన మనీశ్ పాండే.. గత ఏడాది డిసెంబరులో నటి అశ్రిత షెట్టిని వివాహం చేసుకున్నాడు.

లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన మనీశ్ పాండే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్యాట్‌లను గర్ల్‌ఫ్రెండ్స్‌తో పోల్చాడు. ‘‘నా బ్యాట్‌ని గర్ల్‌ఫ్రెండ్‌‌లా చూసుకుంటాను. నా బ్యాగ్‌లో ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి బ్యాట్‌ నాకు ప్రత్యేకమే. ఉదాహరణకి.. బ్యాగ్‌లోని ఓ బ్యాట్‌తో ఐపీఎల్‌లో ఫస్ట్ సెంచరీని నేను నమోదు చేశాను. దాన్ని ముద్దుగా షాడో బ్యాట్ అని పిలుస్తాను. నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు, పెద్ద టోర్నీలకి సిద్ధమయ్యే సమయంలో ఆ బ్యాట్‌తోనే ప్రాక్టీస్ చేస్తాను. కానీ రియల్ లైఫ్‌లో ఒక్కటే బ్యాట్’’ అని మనీశ్ పాండే పరోక్షంగా అశ్రిత గురించి చెప్పుకొచ్చాడు.

2019‌లో నిలకడగా రాణించిన మనీశ్ పాండే విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలను కర్ణాటక టీమ్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా.. ముస్తాక్ టీ20 ఫైనల్ ఆడి గంటల వ్యవధిలోనే అశ్రితని మనీశ్ వివాహం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మనీశ్ పాండే ఆడుతున్న విషయం తెలిసిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *