medak bore well incident: మెదక్: బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు.. 150 అడుగుల లోతులో.. – 3 years old boy fell in to a bore well in medak district papannapet


మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో మూడేళ్ల బాలు బోరు బావిలో పడ్డాడు. పంట పొలం కోసం తవ్విన బోరు బావిలో బాలుడు ఆడుకుంటుండగా పడ్డట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. బాలుడు పడిపోయిన బోరు బావి లోతు దాదాపు 150 అడుగుల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.

గతంలోనూ ఎంతో మంది పిల్లలు బోరు బావిలో పడిన సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. గోవర్థన్ అనే రైతు తన పంట పొలంలో నీటి కోసం మూడు బోరు బావులు తవ్వగా నీరు పడలేదు. బుధవారం వాటిని పూడ్చే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న ఓ బాలుడు బోరు బావిలో పడిపోయాడు.

బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరగ్గా ఇప్పటికే జిల్లా ఎస్పీ సహా రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో భాగంగా నాలుగు జేసీబీలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *