MI vs RR: సెంచరీతో రాజస్థాన్‌ని గెలిపించిన బెన్‌‌స్టోక్స్.. 196 టార్గెట్ ఉఫ్



ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరోసారి భారీ లక్ష్యాన్ని ఛేదించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ (107 నాటౌట్: 60 బంతుల్లో 14×4, 3×6) అజేయ శతకం బాదడంతో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. సంజు శాంసన్ (54 నాటౌట్: 31 బంతుల్లో 4×4, 3×6)తో కలిసి బెన్‌స్టోక్స్ మూడో వికెట్‌కి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ నుంచి ఆఖరి వరకూ ముంబయి కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌ ఆడిన రాజస్థాన్‌కి ఇది ఐదో గెలుపుకాగా.. 11వ మ్యాచ్ ఆడిన ముంబయి టీమ్‌కి ఇది నాలుగో ఓటమి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *