migrant worker letter: దీన్ని దొంగతనం అందామా? కంటతడి పెట్టిస్తున్న వలస కూలీ లేఖ! – migrant labourer steals bycycle to reach bareilly with disabled child, leaves heart wrenching letter for owner


రోనా వైరస్ చరిత్రలో కనీవినీ ఎరుగని వింతలూ, విషాదాలకు కారణమవుతోంది. లాక్‌డౌన్ వేళ వెలుగులోకి వస్తున్న కొన్ని వార్తలు నవ్వులు తెప్పిస్తే, మరి కొన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. మరికొన్ని ఆలోచింపజేస్తే.. ఇంకొన్ని గుండెల్ని పిండేస్తున్నాయి. కొన్ని వార్తలు మనిషిలో మిగిలి ఉన్న మానవత్వాన్ని, విలువలను నిగ్గదీసి నిలదీస్తున్నాయి. రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అలాంటిదే.. కరోనా మహమ్మారి పెట్టిన అగ్ని పరీక్షలో ‘మానవత్వం’ గెలిచి నిలిచిన తీరుకు తార్కాణం ఈ ఘటన.

లాక్‌డౌన్‌తో చితికిపోయి సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నంలో వలస కార్మికులు పడుతున్న కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పిల్లా పాపలతో మండే ఎండలో వేలాది కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన మహమ్మద్ ఇక్బాల్‌ ఖాన్‌‌దీ ఇదే పరిస్థితి. పొట్ట కూటి కోసం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు వచ్చిన అతడి జీవితం లాక్‌డౌన్‌తో తలకిందులైంది.

చేయడానికి పనిలేదు, చేతిలో డబ్బు లేదు.. లాక్‌డౌన్‌ ముగిసేంత వరకు ఎలాగోలా అక్కడే గడుపుదామంటే పూట గడవడం రోజు రోజుకీ కష్టమవుతోంది. అలాగని చాలా మంది వలస కార్మికుల మాదిరిగా నడిచి వెళ్దామంటే.. తనతో పాటు నడవలేని స్థితిలో కొడుకు. కారణం పుట్టుకతో వచ్చిన అవిటితనం..

రోజులు గడిచేకొద్దీ దినదిన గండంగా మారుతుండటంతో ఇక్బాల్ మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ ఆలోచన వచ్చింది. అంతరాత్మ వద్దూ వద్దని హెచ్చరిస్తున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ దొంగతనం చేయాల్సి వచ్చింది. భరత్‌పూర్‌ పరిధిలోని సేనావలి గ్రామంలో ఓ ఇంటి ముందు నిలిపి ఉన్న సైకిల్‌ను అతడు దొంగతనం చేశాడు. నడవలేని తన కుమారుడిని ఆ సైకిల్‌పై కూర్చోబెట్టుకొని వేల కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

Must Read:భారత చెఫ్‌ను ప్రేమపెళ్లి చేసుకున్న ఆ యువరాణి మృతి

కానీ, చెమట చిందించి సంపాదించడమే తెలిసిన ఇక్బాల్.. ఏనాడూ తెలిసి, తెలియకా ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. అందుకే.. యజమానికి చెప్పకుండా సైకిల్ తీసుకెళ్లిపోవడం అతడి గుండెకు భారంగా తోచింది. అలాంటి స్థితిలో ఇక్బాల్.. క్షమించాలంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. పక్కనోడి కంచంలోంచి లాక్కొని తినే ఈ కలికాలంలో ఇక్బాల్ తాను చేసిన తప్పును నిజాయతీగా చెప్పడం మానవతావాదులను ఆలోచనలో పడేసింది. వలస కూలీ దుస్థితికి అద్దంపడుతున్న అతడి లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది.

samayam telugu

వలస కూలీ లేఖ

‘నమస్తే జీ.. విధిలేని పరిస్థితుల్లో నేను మీ సైకిల్ తీసుకెళ్తున్నా.. నేను బరేలీ వెళ్లాలి. నాకో కుమారుడు ఉన్నాడు. అతడు నడవలేడు. అతడి కోసం ఈ పని చేయడం తప్పలేదు. కుదిరితే నన్ను క్షమించండి. నాకు వేరే మార్గం లేదు’ అని ఇక్బాల్ తన లేఖలో రాశాడు. ఇక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. నిజానికి అసలు విషయం ఇక్కడే ఉంది. మతం పేరుతో రెచ్చగొడుతూ మనుషుల మధ్య చిచ్చుపెట్టే వారికి ‘మానవత్వపు మతం’ ఎంత గొప్పదో తెలియజెప్పే కొసమెరుపు ఇదిగో..

ఇక్బాల్ తీసుకెళ్లిన ఆ సైకిల్.. సేనావలి గ్రామంలోని ప్రభు దయాళ్‌ది. అతడి ఆర్థిక స్థితి కూడా అంతంతమాత్రమే. తన సైకిల్ కనిపించకుండాపోయేసరికి ప్రభు దయాళ్ అగ్గిగుగ్గిళమయ్యాడు. దొంగతనం జరిగిందని గ్రహించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ, ఇంతలో లేఖ కనిపించింది. అది చదివాక అతడి మనసు కరిగిపోయింది. వెంటనే ఆ ఆలోచన మానుకున్నారు..

Also Read:బెంగళూరును 30 ఏళ్లు వణికించిన అండర్ వరల్డ్ డాన్ ముతప్ప మృతిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *