mla lockdown violation: ఎమ్మెల్యే లాక్‌డౌన్ ఉల్లంఘన.. భారీకేడ్లు తొలగించి వాహనాలకు అనుమతి – malakpet mla abdullah balala violates lockdown rules in hyderabad


హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం వివాదాస్పదమవుతోంది. లాక్ డౌన్‌లో రోడ్డుపై అడ్డంగా ఉంచిన భారీకేడ్లను తొలగించి వాహనదారులకు అనుమతిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలాలా దగ్గరుండి భారీకేడ్లు తొలగింపజేస్తుండడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీకేడ్లు తొలగింపజేసి వాహనదారులకు ఆయన స్వయంగా అనుమతించారు. ఇందుకు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. డబీర్‌పుర పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

దీనిపై డబీర్‌పుర ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా తామే భారీకేడ్లు తీయించినట్లు చెప్పారు. ఈ ఘటనపై బీజేపీ స్థానిక నాయకుడు రూప్ రాజ్.. డబీర్‌పుర సీఐను ఫోన్‌లో సంప్రదించగా.. ఆ సమాధానం వచ్చింది. పాత బస్తీలో ఎమ్మెల్యే నాయకుల దౌర్జన్యానికి హద్దు లేకుండా పోయిందని రూప్ రాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవల మాజీ మేయర్ పోలీసులను బెదిరించినా కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు.

ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ ఘటనలు సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనాను తరిమికొట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తుంటే, హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం నేతల వల్ల అది సాధ్యం కావడం లేదని విమర్శించారు.

samayam teluguSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *