monal and akhil: అఖిల్‌లో మహానటుడు.. మళ్లీ మోనాల్ కోసం ఏడుపు, సమంత ముందు కన్నీళ్లు – samantha bigg boss episode; akhil sarthak gets emotional about monal gajjar


ఆహా అఖిల్‌లో మామూలు నటుడు లేడండీ బాబూ.. వినేవాళ్లు ఉంటే ఏమైనా చెప్తాడు.. ఎలాగైనా నటిస్తాడు.. ఆరోవారం ఎలిమినేషన్ సందర్భంగా మోనాల్ గజ్జర్, కుమార్ సాయి ఇద్దరే మిగిలితే.. మోనాల్ ఎక్కడ ఎలిమినేట్ అవుతుందో అని బిగ్ బాస్ హౌస్‌లో అన్ని కెమెరాల ముందుకు వచ్చి తెగ ఏడ్చేశాడు.. మోనాల్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతుందా? అయ్యో.. ఇక నా జీవితం శూన్యమే.. ఇక నాకు బతుకు లేదే.. అన్నంత రేంజ్‌లో తెగ జీవించేశాడు.

పాపం అఖిల్ కన్నీళ్లకు బిగ్ బాస్ కెమెరాలు కూడా తడిచిపోయేంత పని అయ్యింది. మొత్తానికి మనోడి ఏడుపో.. లేక మసాలా కంటెంట్ పుణ్యమో తెలియదు కానీ.. మోనాల్ రక్షనార్థం కుమార్ సాయి బలి అయ్యాడు. మోనాల్ సేవ్ కావడంతో అఖిల్.. మోనాల్‌లు బిగ్ బాస్ హౌస్‌లో కౌగిలింతల జాతర చేసేశారు.. వీళ్ల కౌగిలింతలు చూడలేక టీవీలు కట్టేసే పరిస్థితి తీసుకువచ్చారు.

సీన్ కట్ చేస్తే.. ఏడోవారం వచ్చింది.. బిగ్ బాస్ కరెక్ట్‌ ఫిటింగ్ పెట్టేశాడు. పనికి మాలిన రీజన్స్‌తో ఎవరో ఒకర్ని నామినేట్ చేసి చేతులు దులుపేసుకునేట్టుగా కాకుండా.. అఖిల్-మోనాల్‌ల మధ్యనే ఫిటింగ్ పెట్టారు.

మీ ఇద్దరిలో ఎవరు ఉండాలో ఎవరు వెళ్లాలో తేల్చుకోండి అంటే.. అఖిల్‌లోని అసలు కమల్ హాసన్ బయటకు వచ్చాడు. అబ్బబ్బే.. హౌస్‌లో నేనే తోపు.. ఇక్కడ ఆడాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలి.. నేను నీకంటే స్ట్రాంగ్‌ నువ్వే ఎలిమినేట్ అయిపో.. అంటూ మోనాల్‌ని నామినేషన్‌లోకి నెట్టాడు. ఓరినాయనా.. నిన్నే కదరా బోరు బోరున ఏడ్చావు.. కన్నీళ్లు కార్చావు.. ఇప్పుడు నీ వరకూ వచ్చే సరికి నేనే తోపు అంటావా?. పాపం మోనాల్‌ని నామినేట్ చేస్తావా? అని ఏకిపారేశారు నెటిజన్లు.

ఇంటి బయట ఉన్న వాళ్లే కాదు.. లోపల ఉన్న వాళ్లు కూడా అఖిల్ యాక్టింగ్ కింగ్ అని విమర్శలు గుప్పించడంతో మనోడు తెగ ఫీల్ అయిపోయాడట.. ఆదివారం నాడు సమంత ముందు మరోసారి తన నటనా ప్రావీణ్యతను బయటపెట్టాడు.

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అమ్మాయిల బలం, బలహీనతల్ని గురించి చక్కగా చెప్పిన సమంత.. అబ్బాయిలు తమ బలం ఏంటి? బలహీనత ఏంటి అని చెప్పాలని కోరినప్పుడు అఖిల్‌లోని కమల్ హాసన్ మరోసారి బయటకు వచ్చేశాడు.

‘నా బలం ఏంటంటే నేను చాలా ముక్కుసూటి మనిషిని.. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పేస్తా.. నాలో ఓపిక కూడా చాలా ఎక్కువ. అలాగే నా బలహీనత.. ఎవరైనా అబద్ధం ఆడితే అస్సలు నచ్చదు.. కోపం వచ్చేస్తుందని చెప్పాడు.

ఇక మోనాల్ గురించి మాట్లాడుతూ.. ‘ఈవారం నుంచి నేను చాలా బాధపడుతున్నా.. ఎందుకంటే మోనాల్‌ని నామినేట్ చేశా.. గుండె భారంగా ఉంది. నామినేషన్స్ వచ్చినప్పుడు మోనాల్‌కి నాకు పడింది. మేం ఇద్దరం క్లారిటీగానే ఉన్నాం.. నామినేషన్ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాం.. డ్రామా చేయాలని అనుకోలేదు. ఆ పాయింట్‌లో మోనాల్ నాకు బాగా నచ్చేసింది.

కానీ చాలామంది ఏం మాట్లాడారంటే నువ్ నామినేషన్‌లో ఉండాల్సింది.. సింపథీ వచ్చేది అని అంటున్నారు. నేను సింపథీ కోసం రాలేదు.. నాలాగ నేను ఉండటానికి వచ్చా.. ఇక్కడ కూడా నాలాగ నేను లేకపోతే వేస్ట్’ అంటూ తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్. మరి ఈ ఫీలింగ్ నామినేషన్స్ అప్పుడు ఎందుకు లేదో.. ఆ కన్నీళ్లు అప్పుడు ఎందుకు రాలేదో తెలియదు కానీ.. మోనాల్ ఎలిమినేట్ అవుతుందేమో అని తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్.

అయితే అఖిల్ కథ మొత్తం విన్న సమంత.. ‘సరే మోనాల్ నామినేషన్‌లో ఉంది.. ఎలిమినేట్ అయితే నీ ఫీలింగ్ ఏంటని అడగ్గా.. నో ఎలిమినేట్ కాదు.. నాకు తెలిసి ఈరోజు ఎలిమినేషన్ ఉండదు’ అని చెప్పాడు అఖిల్.

మీరు ఆ ఫీలింగ్‌లో ఉన్నారా?? ఎలిమినేషన్ ఉండదని అనుకుంటున్నారా?? సర్లే అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది సమంత.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *