Multiple Sclerosis: కలల్ని చంపేసిన సిరోసిస్ వ్యాధి.. ఆమె కన్నుమూసినా ఎంతో మంది జీవితాల్లో వెలుగు – mssi hyderabad: fundraising to end multiple sclerosis disease as tribute for dancer rama devi


నాట్యం అంటే ఆమెకు ప్రాణం. అయిదేళ్ల నాటి నుంచే శాస్త్రీయ నృత్య సాధన మొదలుపెట్టింది. భరతనాట్యంలో గొప్ప నర్తకిగా ఎదగాలని కలలు కంది. ఆ లక్ష్యానికి చేరువైంది. ఇంతలో వింత వ్యాధి ఆమె కలల్ని చిదిమేసింది. 1980లో తాను నర్తకిగా ఉన్నత శిఖరాలకు చేరుతున్న సమయంలో తొలిసారి మల్టిపుల్ సిరోసిస్ వ్యాధి వచ్చింది. మెడ కింది భాగం నుంచి పక్షవాతం వచ్చింది. అయినా.. 2020 వరకు జీవించింది. తాను బాధను అనుభవిస్తూనే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది. ఆమే ప్రముఖ నర్తకి రమాదేవి.

రోజూ క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయడం, ధ్యానం రమాదేవిని పక్షవాతం బారిన పడిన తర్వాత కూడా 40 ఏళ్లు బతికించాయి. అంతకుమించి తన సానుకూల వైఖరి, నమ్మకంతోనే ఆ వ్యాధిని జయించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయి 2020 మేలో కన్నుమూశారు.

ఏమిటీ మల్టిపుల్ సిరోసిస్..?
మల్టిపుల్ సిరోసిస్ (Mmultiple Sclerosis) అనేది మెదడుకి, వెన్నుముక (నాడీ వ్యవస్థ)కి వచ్చే ఒక వైకల్య వ్యాధి. డిసీస్ మాడిఫయింగ్ థెరపి (DMT) ద్వారా ఆ వ్యాధి తీవ్రతను నియంత్రిస్తారు. మళ్లీ తిరగబెట్టకుండా చూస్తారు. అంతేగానీ, దీనికి ఇప్పటివరకూ సరైన చికిత్స లేదు.

ఈ వ్యాధి కేవలం రోగి పైనే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా మానసికంగా ప్రభావం చూపుతుంది. ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది. సిరోసిస్ వ్యాధిగ్రస్థులకు వారి కదలికలను పెంచడానికి తరచుగా ఫిసియోథెరపీ చేయాల్సి ఉంటుంది.

రమాదేవి

దేశంలో సిరోసిస్ రోగులకు సహాయం అందించి, వారికి మద్దతు కల్పించే ఒకే ఒక్క రిజిస్టర్డ్ సంస్థ మల్టిపుల్ సిరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా (MSSI). రమాదేవి ఈ సంస్థ సేవలు పొందడమే కాకుండా, MSSI బోర్డు మెంబరుగానూ కీలక సేవలు అందించారు. ఈ సంస్థ వారు మల్టిపుల్ సిరోసిస్ రోగులకు అవసరమైన మందులు, ఫిసియోథెరపీ, సహాయ పరికరాలు అందజేస్తారు.

అయితే.. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సంస్థ సేవలను అందించలేకపోతోంది. ఈ ఏడాది ప్రపంచ మల్టిపుల్ సిరోసిస్ దినం రోజున MSSI హైదరాబాదు ఛాప్టర్ వారు మిలాప్ వెబ్‌సైట్‌తో కలిసి ఆన్‌లైన్ ఫండ్ రైసింగ్ ప్రారంభించారు. రమా దేవి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం మొదలుపెట్టారు.

ఈ ఫండ్ రైసర్ ద్వారా MSSI వారు మల్టిపుల్ సిరోసిస్ వ్యాధి గురించి అవగాహన పెంచి, మరింత మంది బాధితులకు వైద్యం అందించాలని భావిస్తున్నారు. మిలాప్ ఫండ్ రైసర్ ద్వారా ఇప్పటికే వందలాది మంది దాతలు లక్షల రూపాయలు విరాళాలు అందించి తమ ఉదారత చాటుకున్నారు. ఈ క్యాంపెయిన్‌ను విజయవంతం చేశారు. కానీ, చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది!

పూర్తి వివరాలు, సాయం చేయడానికి లింక్:https://milaap.org

Also Read:అన్నను కాపాడటానికే ఆ చిన్నారిని కన్నారు.. ఆసక్తికర స్టోరీ

Must Read:గుడ్ న్యూస్: భారతీయుల ఆయుష్షు బాగా పెరిగింది..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *