Naga Babu: Balakrishna: బాలకృష్ణకు నాగబాబు సీరియస్ వార్నింగ్.. మర్యాదగా క్షమాపణ చెప్పు లేదంటే! – mega brother naga babu fires on balakrishna over tollywood meeting with cm kcr


కేసీఆర్‌తో ఇండస్ట్రీ పెద్దల భేటీ విషయం తనకు తెలీదన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు కేసీఆర్‌‌ను కలవడంపై అసహనం వ్యక్తం చేశారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆస్తుల పంచుకోవాడానికి మీటింగ్ అంటూ బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ వీడియో వదిలారు నాగబాబు. ‘నన్ను ఎవరైనా పిలిచారా?? వీళ్లంతా కలిసి భూముల్ని పంచుకుంటారా? హైదరాబాద్‌లో.. నన్ను ఒక్కరు పిలవలేదు’ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన బాలయ్యపై ఫైర్ అయ్యారు నాగబాబు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఈ వీడియో నా సొంత బాధ్యతతో చేస్తున్నాను. లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలోని వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతుంటే.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకూ అంతా కలిసి తలోచేయి వేసి ఆదుకున్నారు. అయితే తిరిగి షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా చేయాలి? అన్న దానిపై ఇండస్ట్రీ పెద్దలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారి ఇంట్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నాగార్జున, త్రివిక్రమ్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి ప్రముఖులతో పాటు.. దర్శకులు, నిర్మాతలు అందరూ హాజరయ్యారు.

అయితే ఆ మీటింగ్ నేపథ్యం ఏంటి?? శ్రీనివాస్ యాదవ్ గారే చిరంజీవి గారి ఇంట్లో కలుద్దాం అన్నారా? అక్కడ ఏమైంది అన్న విషయం తెలియదు కాని.. ఇవాళ బాలకృష్ణ గారు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆయన్ని పిలవక పోవడం అనేది రైటా రాంగా అన్నది నాకు తెలియదు. నిజంగానే పిలిచారా? లేదా? అన్నది అడగాల్సిన బాధ్యత బాలకృష్ణపై ఉంది. కాని ఆయన అలా అడగకుండా నన్ను పిలవలేదు అని కోపపడ్డారు.. అంతవరకూ రీజన్ బుల్‌గానే ఉంది.

కాని ఆయన నోరు జారి భూములు పంచుకుంటున్నారు.. అందుకే కలిశారు అంటూ ఇంకా ఏదో మాట్లాడారు. బూతులు మాట్లాడుతుంటే బీప్ వేశారు. ఆయన్ని పిలవక పోవడం రైట్ అని నేను అనను. ఎందుకంటే కమ్యునికేషన్ గ్యాప్ కావచ్చు. తప్పు జరిగి ఉండవచ్చు. కాని భూములు పంచుకుంటున్నారు అంటూ ఉక్రోశంతో మీరు మాట్లాడిన మాట ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా ఆర్టిస్ట్‌గా ఉన్న నాకు బాధ కలిగించింది. ఈ మాటను వెనక్కితీసుకోండి.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు అలాగే మాట్లాడతా అంటే అంతకు మంచి పది రెట్లు ఎక్కువ మాట్లాడటానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కొంచెం నోరు కంట్రోల్‌లో పెట్టుకోండి బాలకృష్ణ గారు. భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. మమ్మల్ని ఎవరూ పిలవలేదు. ఇదేనా మీకు ఇండస్ట్రీపై ఉన్న గౌరవం.

చాలా చాలా తప్పు మాట్లాడారు. మీరు సినిమా ఇండస్ట్రీనే కాదు.. తెలంగాణ గవర్నమెంట్‌ను కించపరిచారు. తెలంగాణ గవర్నమెంట్ భూములు పంచుతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు. ఖచ్చితంగా మీరు సినిమా ఇండస్ట్రీకి, తెలంగాణ గవర్నమెంట్‌కి క్షమాపణ చెప్పాలి. అది మీ బాధ్యత. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ ఎవడూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలేదు.. అది ఎవరు చేశారో.. ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని నమ్మి ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో మీరు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అన్నది తెలుస్తోంది. మీరు ఏం మాట్లాడినా.. నోరు మూసుకుని కూర్చోడానికి ఎవరూ లేరు. ఇండస్ట్రీలో మీరు ఒక హీరో మాత్రమే.. మాటలు కంట్రోల్‌లో ఉండాలి బాలకృష్ణ గారు’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *