nailpolish remove tips: జెల్ నెయిల్ పాలిష్ ఇలా ఈజీగా పొగొట్టొచ్చంటున్న సోనమ్ కపూర్.. – how to safety remove gel nail polish at home


ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం చేస్తుంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావటంలేదు, బయట దుకాణాలు, షాపింగ్ మాల్స్, బ్యూటీ పార్లర్లు ఇలా అన్ని మూతపడ్డాయి, కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో కొందరు మహిళలు ఇబ్బంది పడతున్నారు. ఎందుకంటే సౌందర్య ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్ లు అందుబాటులో లేవు. మహిళలు ఏ వయస్సులో ఉన్నా నెలకోసారైనా బ్యూటీ పార్లర్‌కు వెళుతుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్రమణ ప్రమాదం కారణంగా స్త్రీలు బయటకు వెళ్లలేని సరిస్థితి.. అయితే చాలా మంది మహిళలు ఈ క్వారెంటైన్ టైమ్‌లో తమ సౌందర్యాన్ని కాపాడుకోవటానికి ఇంట్లో దొరికే వాటితోనే వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను చేసుకొని తమ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నారు.

అయితే మహిళలకు సౌందర్యం అంటే కేవలం ముఖం మాత్రమే కాదు, కురులు నుంచి కాలు గొటి వరకూ ప్రతి విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటారు. అయితే చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయం జెల్ నెయిల్ పాలిష్ . ప్రస్తుతం గొర్ల రంగులో నడుస్తున్న ట్రెండ్ ఇది. అనేక మంది మహిళలు జెల్ నెయిల్ పాలిష్ ను ఇష్టపడతారు. అందుకే అనేక మంది పార్లర్ కు వెళ్లి మరి తమ గోర్లకు జెల్ నెయిల్ పాలిష్ వేయించుకుంటారు. అయితే దీనిని తిరిగి సులభంగా తొలగించలేం. ఒకవేళ తొలగించాలని ప్రయత్నిస్తే గోర్లు దెబ్బ తింటాయి. అందుకే దీన్ని తొలగించాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిందే.. కానీ, బ్యూటీ పార్లర్‌లు తెరవకపోవడంతో అనేక మంది మహిళలు ఈ జెల్ నెయిల్ పాలిష్ తో ఇబ్బంది పడ్తున్నారు. ఇంట్లో జెల్ నౌయిల్ పాలిష్ ను తొలగించడానికి మీరు కష్టపడుతుంటే, ఇంట్లో దాన్ని తొలగించడానికి మీరు సోనమ్ కపూర్ ఒక అద్భుతమైన చిట్కా ను అందిస్తున్నారు.

Also Read : ఇల్లు కొంటున్నారా.. అయితే, ఇలాంటి ఇంటిని అస్సలు కొనొద్దు..

సోనమ్ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. సోనమ్ కేవలం నటి మాత్రమే కాదు, బాలీవుడ్ ఫ్యాషనిస్ట్ కూడా. విభిన్నమైన డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకోవడం తనకు అలవాటు. అద్భుతమైన ఫ్యాషన్లే కాదు.. అద్భుతమైన సౌందర్య చిట్కాలను అందిస్తుంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అభిమానులతో సౌందర్య రహస్యాల గురించి పంచుకుంది. తన బ్యూటీ కేర్ గురించి, అందమైన చర్మానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న విషయాన్ని కూడా వివరిస్తూ ఉంటారు. అలానే సోనమ్ జెల్ నెయిల్ పాలిష్‌ని సులభంగా ఇంట్లోనే ఎలా తొలగించాలి అన్న విషయాన్ని పంచుకున్నారు.

అవును, మీరు నిజంగా మీ గోర్లు దెబ్బతినకుండా ఇంట్లో జెల్ పాలిష్ ను తొలగించవచ్చు. అయితే దీని కోసం మీకు ఓపిక అవసరం ఎందుకంటే ఇతర గొర్ల రంగు మాదిరిగా ఇది అంత సులభంగా తొలిగిపోదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని స్టెప్ బై స్టెప్ పాటిస్తూ జెల్ నెయిల్ పాలిష్ ను సులభంగా ఇంట్లోనే తొలగించు కోవచ్చు.

ఈ చిట్కా పని చేయడానికి, మీరు కాస్తా ఓపిక పట్టాలి. అదే విధంగా ఈ నియమాలను పాటించాలి.

నెయిల్ ఫైలర్ ను ఉపయోగించండి:

సాధారణంగా జెల్ నెయిల్ పాలిష్ సాధారణ నెయిల్ పాలిష్ మాదిరిగా ఉండదు. అందుకే, జెల్ ఆయిల్ పాలిష్ ను తొలగించడానికి కొన్ని నియమాలు పాటించాలి. దీనికోసం ముందుగా మీరు నెయిల్ ఫైలర్ ను ఉపయోగించండి. ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. పాలిష్ యొక్క మెరిసే టాప్ కోట్‌ని తొలగించండి. అంటే మీ గొర్లపై ఉండే జెల్ పాలిష్ పై పొరను నెయిల్ ఫైలర్ ను ఉపయోగించి దూరం చేయొచ్చు.

Also Read : లో దుస్తులు లేకుండా పడుకుంటే ఏమవుతుందో తెలుసా..

క్రీమ్ రాయండి

గొర్ల పై ఉన్న జెల్ పాలిష్ పై పొరను తొలగించిన తర్వాత, మీ గొర్ల చుట్టూ ఉండే చర్మానికి మీ వద్ద ఉన్న క్యూటికల్ ఆయిల్, క్రీమ్‌ని రాయండి. దీని వల్ల గొర్ల చుట్టూ ఉన్న చర్మం మృదువుగా ఉంటుంది. ఒక వేళ మీ వద్ద క్యూటికల్ ఆయిల్ లేకపోతె మీ గొర్ల చుట్టూ ఉన్న చర్మానికి సాధారణ మందపాటి క్రీమ్‌ని కూడా వాడొచ్చు.

కాటన్ బాల్స్ ను నానబెట్టండి:

సాధారణంగా కాటన్ బాల్స్ మీ వద్ద ఉంటే వాటిని కొన్ని అసిటోన్‌లో నానబెట్టాలి. ఒకవేళ మీ వద్ద పెద్ద కాటన్ బాల్స్ ఉంటే వాటిని మీ గోరు పరిమాణం ప్రకారం కత్తిరించండి. మరియు కాటన్ బాల్స్‌ను అసిటోన్ లో బాగా నానబెట్టండి. అసిటోన్ జెల్ పాలిష్‌ను తొలగించడానికి సాయపడుతుంది.

Also Read : ఈ టీ తాగితే గుండె సమస్యలు దూరం..

అల్యూమినియం ఫాయిల్‌ని ఉపయోగించండి:

ఆసిటోన్‌లో నానబెట్టిన కాటన్ బాల్స్ ను తీసుకొని మీ గోళ్ళపై ఉంచి, వాటిని సోనమ్ చేసినట్లుగా అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించి పూర్తిగా కవర్ చేయండి. ఎందుకంటే సాధారణ నెయిల్ పాలిష్ మాదిరిగా తొలగించడం కుదరదు. అందుకే జెల్ పాలిష్ తొలగించడానికి అసిటోన్‌లో నానబెట్టి నానబెట్టిన బాల్స్ ను ఉపయోగించాలి. ఇది పొరల మాదిరిగా జెల్ పాలిష్ ని శుభ్రం చేస్తుంది.

దీన్ని వెంటనే తొలగించకూడదు, మీ గోర్లను అలానే ఒక 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. కొంత సమయం తర్వాత జెల్ పాలిష్ దాని అంతట అదే పొరలు మాదిరిగా వచ్చేస్తుంది. ఒకవేళ అప్పటికీ జెల్ పాలిష్ తొలగిపోకుండా మొండిగా ఉంటే మీరు ఈ విధానాన్ని పునరావృతం చేయాలి. అయినప్పటికీ, జెల్ పాలిష్ తొలగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇదే మీరు గోర్లను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి, జెల్ పాలిష్ ను పీల్ చేయడంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ జెల్ పాలిష్ ను ఎప్పుడు తొలగించవచ్చంటే మీరు మీ గోర్లను అసిటోన్ లో నానబెట్టిన తరువాత అది పొరలా వచ్చేస్తుంది అప్పుడు మాత్రమే దీన్ని తొలగించాలి. ఒకవేళ అది అలా పొరలా రాకపోతే మళ్లీ ఓ సారి ఇలా చేయండి… ఇలా జెల్ పాలిష్ పోయే వరకు ఇదే విధానాన్ని పాటించండి. కానీ కాస్త జాగ్రత్త వహించండి లేకుంటే మీ గోర్లు పాడయ్యే అవకాశం ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *