Nandamuri Balakrishna: Tdp Mahanadu: జగన్ సర్కార్‌‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు – hindupur mla nandamuri balakrishna interesting comments on ysrcp government in tdp mahanadu


ఏపీ ప్రభుత్వంపై నందమూరి బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదన్నారు.. టీడీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుంది. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణమని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఉందా.. లేదా అనే అనుమానం వస్తుందన్నారు. రెండో రోజు టీడీపీ మహానాడులో పాల్గొన్న బాలయ్య.. తన అభిప్రాయాలను పార్టీ నేతలతో పంచుకున్నారు. తన అవసరం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతాను అన్నారు బాలయ్య. ఎన్టీఆర్ వారసులు తాము కాదని.. టీడీపీ కార్యకర్తలే అన్నారు.

ఎన్టీఆర్ కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారని.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు బాలయ్య.. టీడీపీకి కార్యకర్తల పెద్ద బలమని.. తెలుగు దేశంకు ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరన్నారు. తన తుది రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే తన జీవితం అంకితం అన్నారు. తెలుగుదేశం పార్టీ సేవకే తన జీవితం అంకితమని.. ఈ అరాచక పాలన అంతానికి 5ఏళ్లు అవసరం లేదు. ప్రజలే అరాచకశక్తులకు తగిన బుద్ది చెబుతారన్నారు.

ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువాడికి పండుగ రోజన్నారు హిందూపురం ఎమ్మెల్యే. తన ఆదర్శాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిన వ్యక్తి ఎన్టీఆర్.. తెలుగుజాతి నిర్వీర్యమై దిక్కుతోచని స్థితిలో మద్రాసీలుగా పిలువబడే పరిస్థితుల్లో ఎన్టీఆర్ తెలుగువారికి గుర్తింపు తెచ్చారననారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ద్వారా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు పెంచారనేది ప్రతి తెలుగువాడి భావన..తన కుటుంబానికి, తన భాషకు, తన జాతికి, తన రాష్ట్రానికి ఎనలేని గుర్తింపు తెచ్చారన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *