nizamabad wall collapse: నిజామాబాద్‌లో విషాదం.. గోడ కూలి నిద్రలోనే ముగ్గురి మృతి – three including a child dies and 4 injured in a wall collapse in nizamabad


ఇంటి గోడ కూలడంతో గాఢ నిద్రలో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వర్ని మండలం తంగేలేపల్లికి చెందిన శ్రీనివాస్ (35), లక్ష్మీ (30) దంపతులు తమ కుమారుడు సాయి (ఏడాదిన్నర వయసు), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి వరండాలో నిద్రిస్తుండగా.. గోడ కూలింది. దీంతో శ్రీనివాస్ దంపతులు, వారి కుమారుడు సాయి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో తంగేలేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *