parenting tips during lockdown : లాక్‌డౌన్ టైమ్‌లో మీ పిల్లలకి ఈ ఆర్ట్స్ నేర్పించండి.. – intresting fun diy to make lockdown know here all details


కరోనా వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోడానికి అందరం ఇంట్లోనే ఉంటున్నాం. కానీ, పిల్లలకి అదెంత విసుగ్గా ఉంటుంది. వాళ్ళు ఈ టైమ్‌లో సరదాగా, ఉత్సాహంగా గడపడానికి కొన్ని చిట్కాలు, కొన్ని పనులు పేరెంటింగ్ కోచ్ కుహూ గుప్తా చెబుతున్నారు. వీటి వల్ల పిల్లలూ పేచీలు పెట్టకుండా ఉంటారు. పెద్దవాళ్ళకీ ప్రశాంతం గా ఉంటుంది. అవేంటంటే.. “పిల్లలు మిమ్మల్ని బాగా విసిగిస్తూ ఉండొచ్చు. వాళ్ళ భయాల, చిరాకులూ వాళ్ళకీ ఉంటాయి. వాళ్ళు రోజు మొత్తం మీద ఏం చేయాలనుకున్నారో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే బావుంటుంది”. పిల్లలు ఇంట్లోనే ఉండి సరదాగా చేయగలిగే కొన్ని పనులను ఆమె మనతో పంచుకున్నారు. .పేపర్ ప్లేట్ డ్రీం క్యాచర్..


కావాల్సిన వస్తువులు..


పేపర్ ప్లేట్స్, ఊలు, కత్తెర, పంచింగ్ మెషీన్, పూసలు, ఈకలు.

తయారుచేసే విధానం..


పేపర్ ప్లేట్ మధ్య భాగాన్ని కత్తిరించండి. తరవాత పంచింగ్ మెషీన్ తో పేపర్ ప్లేట్స్ అంచు లోపల రంధ్రాలు చేయండి. ఇప్పుడు సుమారుగా మూడు అడుగుల ఊలు తీస్కుని ఒక కొసని ఒక రంధ్రం దగ్గర ముడి వేయండి. మిగిలిన రంధ్రాలలో నించి ఈ ఊలుని తిప్పండి. చివరి రంధ్రం దగ్గర బయటికొచ్చిన ఊలుకి పూసలు గుచ్చి చివర ఒక ఈకని అతికించి మిగిలిన ఊలుని కత్తిరించేయండి. ఇలా అన్ని రంధ్రాలో నుంచి వచ్చేలా చేయండి.

Also Read : ఇలా చేస్తే బట్టలపై ఉన్న ఏ మరకలైనా పోతాయి..

పాత గాజు సీసాలని అలంకరించనివ్వండి..


కావాల్సిన వస్తువులు..


గాజు సీసాలు, ఆక్రిలిక్ పెయింట్స్, పెయింట్ బ్రషెస్

తయారు చేసే విధానం..

చాలా తక్కువ ఖర్చుతో పాత సీసాలని పనికొచ్చేలా చేయొచ్చు. ఒక పాత సీసాని శుభ్రంగా కడగండి. మీకు కావాల్సిన రంగుల్లో, కావాల్సిన డిజైన్లలో ఈ సీసాని అలంకరించండి.

ధ్యానం..


మనకు తెలియకపోవచ్చు కానీ లాక్ డౌన్ వల్ల పిల్లలు కూడా ఒత్తిడికి గురౌతారు. ఒత్తిడి తగ్గించి మనసుకి విశ్రాంతినిచ్చే ధ్యానం వాళ్ళకీ అవసరమే. చిన్న వయసులోనే ధ్యానానికి అలవాటు చేయడం వల్ల పిల్లలకి ఆత్మ నిగ్రహం పెరుగుతుంది. ఇతరులనీ, వారి అభిప్రాయలనీ గౌరవించడం, శ్రద్ధగా ఉండడం లాంటి మంచి లక్షణాలు వస్తాయి.

మట్టి లేకుండానే మొక్కలు పెంచడం..


ఇది పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. మొక్కలు పెరగడానికి మట్టి అత్యవసరమేమీ కాదు. ఆహారం, నీరు, సూర్యరశ్మి, గాలి, ఆధారం…ఈ ఐదూ ఉంటే చాలు మొక్కలకి. దీనికి కావాల్సినవి ఒక చిన్న మొక్క, ఒక సీసా, ఒక బెండు ముక్క (మధ్యలో రంధ్రం ఉండాలి), కొద్దిగా దూది, మొక్కలకి కావాల్సిన ఆహారం.

Also Read : రోజుకి ఎన్ని అడుగులు నడిస్తే మంచిది..

తయారు చేసే విధానం..


ముందుగా పాత పేపర్లని పరవండి. మొక్కని జాగ్రత్తగా దాని కుండీ లోంచి బయటికి తీయండి. మొక్క వేళ్ళకి అంటుకున్న మట్టిని జాగ్రత్తగా దులపండి. సీసాలో గోరువెచ్చని నీరు నింపి సీసాకి బెండు ముక్క బిగించండి. ఇప్పుడు ఈ బెండు ముక్కకున్న రంధ్రం లోంచి మొక్క వేరుని జాగ్రత్తగా సీసాలోకి దింపండి. బెండుముక్కకున్న రంధ్రాన్ని దూదితో మూసేయండి. ఇప్పుడు దీన్ని బాగా ఎండ ఉండే చోట పెట్టండి. వారానికొకసారి నీళ్ళు మారుస్తూ ఉంటే సరిపోతుంది. ఈ మొక్కకి కావాల్సిన ఆహారం కూడా మీరే తయారు చేయొచ్చు. సుమారుగా నాలుగు లీటర్ల నీళ్ళు తీస్కోండి. అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ ఎప్సం సాల్ట్, అర టీ స్పూన్ అమ్మోనియా వేసి ఒక అరగంట పాటూ కదపకుండా ఉంచేయండి. నెలకొకసారి నీళ్ళు మార్చినప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా నీళ్ళలో కలపండి.

Also Read : ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాళ్ల వాపులు ఎందుకు వస్తాయంటే..

ఫింగర్ ప్రింట్ ఆర్ట్..


పిల్లలకి బాగా నచ్చే పని ఇది. ఒక కప్పు నిండా నీళ్ళు తీస్కోండి. బ్రష్ ని నీళ్ళలో కడిగి మీకు కావాల్సిన రంగులో ముంచి మీ వేళ్ళ నిండా ఆ రంగు వేస్కోండి. ఇప్పుడు మీకు కావాల్సిన డిజైన్లలో పేపర్ మీద మీ వేళ్ళని అద్ది చూడండి. ఎంత బావుందో కదా! పువ్వులూ, పక్షులూ, జంతువులూ ఏవి కావాలంటే అవి మీరు పేపర్ మీద వేసుకోవచ్చు.

ఇంట్లోనే ఉండాల్సి వచ్చిన ఈ సమయాన్ని కుటుంబమంతా ఆనందంగా గడపండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *