pearl millet benefits: సజ్జపిండితో దీపాలు.. బ్రెస్ట్ కాన్సర్ దూరమవుతుందట.. – amazing health benefits of pearl millets know here all details


చిరు ధాన్యాలు నిజంగా సిరి ధాన్యాలే. ఇవి ఎంత రుచికరంగా ఉంటాయో, అంత ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. ఈ చిరు ధాన్యాలతో ఎన్నో కొత్త కొత్త వెరైటీలు ట్రై చేయవచ్చు. ఈ వెరైటీలు ఆహారం లోనే కాదు, ఇతర విషయాల్లో కూడా ట్రై చేయవచ్చు. ఉదాహరణకి ప్రమిదలు. అయితే, ఈ ప్రమిదలు వెలిగించడానికి కాదండోయ్, ప్రమిదలు వెలిగించేశాక ఏదైనా తియ్యగా తినాలంటారు కదా, అందుకు. ఈసారి దీపావళికి స్వీట్ కూడా ప్రమిదల షేప్ లో ట్రై చేయండి. ఎంత సరదాగో ఉంటుందో చూడండి. హెల్త్ బెనిఫిట్స్ బోనస్ అన్న మాట.

సజ్జపిండి ఎందుకు మంచిది..

సజ్జలని ఆహారం లో చేర్చుకోవడం వలన ఎన్నో లాభాలున్నాయి. సజ్జాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, అందుకని సజ్జలు డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. ఫలితంగా కార్డియో వాస్క్యులర్ హెల్త్ బావుంటుంది. సజ్జాల్లో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్ కాన్సర్ ని ప్రివెంట్ చేయగలవు, ప్రత్యేకించి బ్రెస్ట్ కాన్సర్‌ని. ఇవి ఆస్థ్మా ని కూడా ప్రివెంట్ చేస్తాయి. సజ్జల వల్ల మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇందులో విటమిన్ బీ కంటెంట్ ఎక్కువ.

Also Read : రోజూ ఈ నూనెతో మసాజ్ చేస్తే బరువు తగ్గుతారట..

సజ్జ ప్రమిదలు ఎలా చేయాలో, అందుకు కావలసిన పదార్ధాలేమిటో ఇప్పుడు చూద్దం. ఇక్కడ ఎనిమిది ప్రమిదలు చేయడానికి సరిపోయే విధంగా కొలతలు ఉన్నాయి.

* అర కప్పు సజ్జ పిండి
* రెండు టేబుల్ స్పూన్ల ఏ2 ఆవు నెయ్యి లేదా, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె
* అర కప్పు అప్పుడే తురిమిని కొబ్బరి
* రెండు టీ స్పూన్ల గుమ్మడి గింజలు
* పావు కప్పు తాటి బెల్లం, లేదా ఏదైనా నాచురల్ స్వీటెనర్
* పావు కప్పు సన్నగా తరిగిన వాల్నట్స్
* పావు కప్పు గింజలు తీసేసి తరిగిన ఖర్జూరాలు
* ఒక టీ స్పూన్ ఏలకుల పొడి
* రెండు టేబుల్ స్పూన్ల పాలు, లేదా వేగన్ మిల్క్
* అలంకరణకి సిల్వర్ లీవ్స్

Also Read : పండుగ టైమ్‌లో షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే..

iStock-1219784054

తయారు చేసే పద్ధతి:

1. అడుగు లోతు గా ఉన్న మూకుడు లో నెయ్యి లేదా నూనె వేసి సజ్జ పిండి కూడా వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించండి. తురిమిన కొబ్బరి వేసి కొబ్బరి క్రిస్ప్ గా మారేవరకూ వేయించండి.
2. ఇప్పుడు తాటి బెల్లం, లేదా మీరు ఎంచుకున్న నాచురల్ స్వీటెనర్ వేసి, అర టీ స్పూన్ ఏలకుల పొడి వేయండి.
3. అన్నీ బాగా కలిపి రెండు టేబుల్ స్పూన్ల పాలు లేదా వేగన్ మిల్క్ వేసి కొద్దిగా ముద్దగా అయ్యేవరకూ కలపండి.
4. దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.
5. ఇదే మూకుడు లో క్రష్ చేసిన గుమ్మడి గింజలు, వాల్నట్స్, ఖర్జూరాలు వేసి, అర టీ స్పూన్ ఏలకుల పొడి కూడా వేసి కలపండి.
6. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలనీ ఎనిమిది సమాన భాగాలు చేయండి.
7. సజ్జ పిండి, కొబ్బరి మిశ్రమంతో ప్రమిదలు చేయండి. ప్రమిద మధ్యలో ఖార్జూరాల మిశ్రమం పెట్టండి.
8. అరగంట సేపు ఫ్రిజ్ లో ఉంచితే ప్రమిద గట్టి పడుతుంది.
9. సిల్వెర్ లీవ్స్ తో మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోండి.
10. వీటిని చేసిన రోజే తినేయడం మంచిది.

Also Read : కరివేపాకుని ఇలా చేసి తింటే డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందట..

జాగ్రత్తలు..

1. సజ్జ పిండి ఎప్పుడూ ఇంట్లో చేసినది వాడడమే మంచిది.
2. ఖర్జూరాల బదులు ఎందిన ఫిగ్స్, క్రాన్ బెర్రీస్, తురిమిన ఆంలా క్యాండీ కూడా వాడుకోవచ్చు.
3. సజ్జ పిండి బదులు జొన్న పిండి కూడా వాడుకోవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *